Allu Arjun: అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు అతనిని సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అమితంగా అభిమానిస్తారు.అలా అల్లు అర్జున్ పై ఇష్టంతో ఒక టాలీవుడ్ నటి 15 రోజులు తిండి మానేసిందట. మరి ఎందుకో తెలుసుకుందాం రండి.

Allu Arjun: అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Allu Arjun

Updated on: Feb 28, 2026 | 6:27 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడీ పాన్ ఇండియా హీరోతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. అలాగే స్టార్ హీరోయిన్లు సైతం బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు ఒక నటి ఏకంగా 15 రోజుల పాటు భోజనం కూడా తినకుండా డైట్ పాటించిందట. బన్నీ పక్కన స్లిమ్ గా కనిపించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానంటోందీ అందాల తార. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫేమ్ హరితేజ. పలు సినిమాల్లో సహాయక నటి పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అల్లు అర్జున్ గారి సినిమాలో ఛాన్స్ అంటే ఆయన పక్కన స్లిమ్ గా కనిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే 15 రోజులపాటు ఎలాంటి ఫుడ్ తినకుండా ఉన్నాను. కేవలం లిక్విడ్ డైట్ తీసుకుంటూ చాలా స్లిమ్ గా అయ్యాను. ఇలా షూటింగ్ రేపనగా ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. మొదటి రోజు షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టగానే బన్నీ నేరుగా నా వద్దకు వచ్చారు. నన్ను చూడగానే బన్నీ బిగ్ బాస్ లో నీ పెర్ఫామెన్స్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఆయన నన్ను గుర్తు పెట్టుకొని మరి నా దగ్గరకు వచ్చి చెప్పారు. అప్పుడు నేను ఈ భూమి మీద నిలబడలేకపోయాను. ఆకాశంలో విహరించాను’ అంటూ అప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకుంది హరి తేజ. ప్రస్తుతం బన్నీ గురించి ఈ బిగ్ బాస్ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శివరాత్రి వేడుకల్లో హరి తేజ..

కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హరి ప్రియ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది. ముఖ్యంగా నితిన్-సమంత హీరో, హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అఆ సినిమాలో హరితేజ పోషించిన పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమా తర్వాతనే హరితేజకు అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us