Bommarillu: ఆ రోజు సెట్‌లో బన్నీ లేకుంటే బొమ్మరిల్లులో జెనీలియా నటించేది కాదు.. ఒక్క సీన్‌ కోసం రాత్రంతా.

|

Aug 29, 2021 | 5:21 PM

Bommarillu: బొమ్మరిల్లు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా...

Bommarillu: ఆ రోజు సెట్‌లో బన్నీ లేకుంటే బొమ్మరిల్లులో జెనీలియా నటించేది కాదు.. ఒక్క సీన్‌ కోసం రాత్రంతా.
Bommarillu
Follow us on

Bommarillu: బొమ్మరిల్లు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా ఆయన ఇంటి పేరుగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరో సిద్ధార్థ్‌కు ఏ రేంజ్‌లో పేరు తీసుకొచ్చిందో.. హీరోయిన్‌ జెనీలియాకు కూడా అదే స్థాయిలో విజయాన్ని అందించింది. హాసిని పాత్రలో సహజ నటనతో ఆకట్టుకున్న జెనీలియా ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుంది. అయితే ఓ సంఘటన జరగకపోయుంటే ఆ సినిమా నుంచి జెనీలియా తప్పుకునేదన్న విషయం మీకు తెలుసా.?

ఇంతకీ విషయమేంటంటే.. బొమ్మరిల్లు సినిమా షూటింగ్‌ ప్రారంభమైన తొలి రోజుల్లో హీరో, హీరోయిన్‌ ఐస్‌ క్రీమ్‌ తినే సన్నివేశాన్ని షూట్‌ చేయాల్సి వచ్చింది. అయితే దర్శకుడు భాస్కర్‌ పర్‌ఫెక్షన్‌ పేరుతో ఆ సన్నివేశాన్ని ఏకంగా రాత్రంతా తెరకెక్కించాడంటా. కేవలం రెండు డైలాగ్‌లు మాత్రమే ఉన్న సన్నివేశం కోసం 35 టేక్స్‌ తీసుకున్నారట. దీంతో విసుగు చెందిన జెనీలియా సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచించిందంటా.

 

అయితే షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో అక్కడే ఉన్న అల్లు అర్జున్‌ జెనీలియాకు నచ్చజెప్పి సినిమాలో నటించేందుకు ఒప్పించారు. భాస్కర్‌ చాలా మంచి దర్శకుడని చెప్పిన బన్నీ.. ఒక్క సీన్‌ చూసి అతడిని అంచనా వేయకని జెనీలియాకు హిత బోధ చేశారు. దీంతో అలా హాసిని పాత్ర వెండి తెరపై తళుక్కుమంది. ఇదిలా ఉంటే జెనీలియా బొమ్మరిల్లు సినిమా కంటే ముందే బన్నీతో ‘హ్యాపీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే నిజానికి బొమ్మరిల్లులో బన్నీనే హీరోగా నటించాల్సి ఉంది. కానీ కాల్షీట్లు అందుబాటులో లేకపోయే సరికి బన్నీ సినిమా నుంచి తప్పుకున్నారు.

Also Read: Megha Akash: వేదాంతం వల్లిస్తోన్న అందాల భామ.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటూ..

Rashmika Mandanna: మిషన్ మజ్ను పై ఆసక్తికర ట్వీట్ చేసిన రష్మిక.. ఫోటో వైరల్..

Nagarjuna: నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ లుక్‌. లండన్‌ నేపథ్యంలో..