
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు ప్రయివేట్ సాంగ్స్ , ఫోక్ సాంగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో.. ఫోక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతున్నాయి. విదేశాల్లోనూ మన సాంగ్స్ వినిపిస్తున్నాయి. అలాంటి సాంగ్స్ లో ఈ సాంగ్ ఒకటి. ఎక్కడ చూసిన ఈ పాటే తిరుగుతుంది. ఎవ్వరి నోటా విన్న ఈ పాటే ఎక్కువుగా వినిపిస్తుంది. పాట వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఆ సాంగ్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ఇంతకూ ఆ జానపద గీతం ఏంటంటే..
సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ సాంగ్ మరేదో కాదు.. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ..! రాము రథడ్ ఆలపించిన ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయ్యింది. ప్రేమికులంతా ఈ సాంగ్ ను తెగ పాడేసుకున్నారు. సోషల్ మీడియాలో వాడేసుకున్నారు. ఈ సాంగ్ కు యూట్యూబ్ లోనే కాదు పలు టీవీ షోల్లోనూ మారుమ్రోగింది.
ఈ సాంగ్ తో రాము రాథోడ్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్ 316 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కు కళ్యాణ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ సాంగ్ రాసి పాడింది, నటించింది కూడా రాము రాథోడే అవ్వడం మరో విశేషం.. ఇక ఈ సాంగ్ ను సినిమాల్లోనూ వాడుకున్నారు. సందీప్ కిషన్ నటించిన మజాకా సినిమాలో ఈ సాంగ్ ను వాడేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్. మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.