Actress : 15 ఏళ్లకే రిసెప్షనిస్ట్‏గా జాబ్.. 17 ఏళ్లకే ఐశ్వర్య రాయ్‏కే పోటీ ఇచ్చింది.. ఒక్క సినిమాతో తెలుగులో సంచలనం..

సినీరంగంలోకి అడుగుపెట్టకముందు చాలా మంది ఏదోక వర్క్ చేస్తుంటారు. కొందరు బుల్లితెర ద్వారా తమ సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు నటీనటులుగా సెటిల్ అయినవారు ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ముందుగా స్మాల్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరపై తనదైన ముద్ర వేయాలనుకుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు.

Actress : 15 ఏళ్లకే రిసెప్షనిస్ట్‏గా జాబ్.. 17 ఏళ్లకే ఐశ్వర్య రాయ్‏కే పోటీ ఇచ్చింది.. ఒక్క సినిమాతో తెలుగులో సంచలనం..
Anitha

Updated on: Apr 26, 2026 | 3:16 PM

తెలుగు సినిమా ప్రపంచంలో ఆమె ఒక సంచలనం. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక చోటు సంపాదించుకుంది. ఆమె టీవీలో అత్యంత ఖరీదైన నటిగా కూడా నిలిచింది. తన తండ్రి మరణం తర్వాత ఆమె నటనారంగంలోకి అడుగుపెట్టింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కలిసి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసినా, విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆమెకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వయసు 45 సంవత్సరాలు. తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు చిత్ర పరిశ్రమలో ఆమె అదృష్టం కలిసి రాలేదు. ఈ హీరోయిన్ పేరు అనితా హసనందాని.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

తన 27 ఏళ్ల కెరీర్‌లో, అనితా తన డైలీ సీరియల్స్ ద్వారా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. దీంతో కుటుంబాన్ని పోషించడానికి, ఆమె రిసెప్షనిస్ట్‌గా పని చేయాల్సి వచ్చింది. 1998లో అనితా ‘ఇధర్ ఉధర్’ అనే హిందీ సీరియల్‌తో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆమె ‘హరే కాంచ్ కి చురియాన్’ అనే టీవీ సీరియల్‌లో కనిపించారు. 1999 నాటి సూపర్ హిట్ చిత్రం ‘తాల్’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆమె ‘తాల్’లోని ప్రసిద్ధ పాట ‘ఇష్క్ బినా’లో కనిపించింది. ఆ తర్వాత, 2001లో, ‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. ఉదయ్ కిరణ్ జోడిగా కనిపించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ అంతగా బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. తర్వాత వరుసగా సీరియల్స్ చేసింది. అనితా 2013లో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె ఒక నటి అని తెలియకుండా, రోహిత్ మొదట ఫేస్‌బుక్ మెసేజ్ ద్వారా ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వారు ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా కలుసుకుని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం గోవాలో తెలుగు-సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరికి బాబు ఉన్నాడు. ప్రస్తుతం అనితా తెలుగు, హిందీలో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.48 కోట్లు అని టాక్.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us