Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..

ప్రస్తుతం స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది ఓ హీరోయిన్. నిత్యం వివాదాలతో వార్తలలో నిలిచే ఈ అమ్మడు వయసు 31 సంవత్సరాలు. దాదాపు 11 సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. కానీ ఆమె తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తోంది.

Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..
Urvashi

Updated on: Dec 20, 2025 | 12:46 PM

సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన ఏ మూవీ హిట్టు కాలేదు. దీంతో ఇప్పుడు స్పెషల్ పాటలతో అలరిస్తుంది. దాదాపు 11 సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ , మోడల్ ఊర్వశి రౌతేలా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీతోపాటు తెలుగులోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ మిస్ దివా – మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించిన ఆమె, బాలీవుడ్, దక్షిణ భారత సినిమా రెండింటిలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 31 ఏళ్ల ఈ నటి సినిమాల్లో విజయాల కంటే వైఫల్యాలను ఎక్కువగా ఎదుర్కొన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఖరీదైన బట్టలు, లగ్జరీ బ్యాగులు, ఆభరణాలతో సహా ఆమె విలాసవంతమైన జీవనశైలికి ఆమె తరచుగా వార్తల్లో ఉంటుంది. ఒకసారి తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేసి అందరినీ తనవైపు చూసేలా చేసింది. మరోసారి 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఫోన్ కేసుతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..

హిందీతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగా ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో స్పెషల్ పాటలతోనే ఫేమస్ అయ్యింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.200 కోట్లకుపైగానే ఉన్నట్లు సమాచారం. 3 నిమిషాల పాటకు దాదాపు 3 కోటలు వసూలు చేస్తుందని టాక్.

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..