సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్ మతిపోగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 27 సంవత్సరాలు. కానీ కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు కూడబెట్టింది. చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అయిన ఈ వయ్యారి గతేడాగి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఓరేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ. హిందీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నటిగా అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకున్న జాన్వీకి సరైన బ్రేక్ రాలేదు. గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ ఊహించని రేంజ్ లో మారిపోయింది. దీంతో తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తుంది. అలాగే దేవర పార్ట్ 2లో నటిస్తుంది.
దేవర సినిమా తర్వాత జాన్వీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 27 ఏళ్ల వయసులోనే కోట్ల ఆస్తిని కూడబెట్టింది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ కోట్లు సంపాదించింది. కొన్ని రోజుల క్రితం ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. అలాగే ఈ అమ్మడి దగ్గర కాస్ట్లీ కార్లు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు వెర్రెక్కిస్తుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..