నిర్మాతగా అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. గీత ఆర్ట్స్ పథకం పై చాలా సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 పేరుతోనూ సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్ చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ 2 పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్. 1974లో బంట్రోతు భార్య అనే సినిమాతో గీత ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. అయితే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కు ఆ పేరు ఎందుకు పెట్టారో వివరించారు. గతంలో ఈ విషయం పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గ మారాయి.
ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహించిన ఓ ప్రోగ్రాం లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అసలు గీతా ఆర్ట్స్ అని ఎందుకు పేరు పెట్టారు.. గీత అంటే ఎవరు అని అలీ అడిగారు. దానికి అల్లు అరవింద్ సమాధానమిస్తూ.. తన గర్ల్ ఫ్రెండ్ పేరు గీతా అని అన్నారు కానీ అందుకు తమ నిర్మాణ సంస్థకు ఆ పేరు పెట్టలేదు అని సరదాగా అన్నారు అల్లు అరవింద్.
తన సినిమా సంస్థకు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ పేరును సూచించారట. గీత అంటే భగవత్ గీత అని అర్ధం.. అందులో చెప్పినట్టుగా ప్రయత్నం మాత్రమే చేయాలి ప్రతిఫలం మన చేతిలో ఉండదు.. సినిమా చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టాం అని తెలిపారు అల్లు అరవింద్. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్ మన చేతిలో ఉండదు’ అన్న విధంగా సంస్థకు గీతాఆర్ట్స్ అని పెడదాం అని చెప్పారట అల్లు అరవింద్. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.