Ram Charan: గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా..?

చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు.

Ram Charan: గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా..?
Govindudu Andarivadele

Updated on: Dec 25, 2022 | 6:36 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమాలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మడు ఎవరో తెలుసా ..

ఆ అమ్మడు పేరు అయేషా కాదుస్కర్. ఈ చిన్నది చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉంటుంది. కానీ ఈమె ముంబై కి చెందని నటి. 2012లో వచ్చిన హృతిక్ రోషన్ అగ్నిపథ్ సినిమాలో నటించింది అయేషా.. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాలో చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us