పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పవన్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలు తగ్గించారు. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన పవన్.. ఇప్పుడిప్పుడే వరుస చిత్రాలతో అలరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..
Cameraman Gangatho Rambabu

Updated on: Nov 21, 2025 | 6:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలు రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమా షూటింగ్స్ త్వరలోనే పూర్తి చేయనున్నారు పవన్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా ప్రేక్షకులను మెప్పించింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది.

నన్ను అలా చూస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా..? ఓపెన్‌గా మాట్లాడిన హీరోయిన్

బద్రి సినిమాతో పవన్ కల్యాణ్ తో కలిసి పని చేశారు పూరి.. ఆతర్వాత చాలా ఏళ్ల తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో పవన్ నటన, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఈ పాటలో పవన్ తో కలిసి స్టెప్పులేసిన హీరోయిన్ గుర్తుందా.?

ఇవి కూడా చదవండి

రెండు పెళ్లిళ్లు.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు సింగిల్‌గా ఇలా.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఆమె పేరు స్కార్లెట్ మెల్లిష్ విల్సన్.. ఈ అమ్మడు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు విదేశీ నటి. తెలుగులోనూ నటించి మెప్పించింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. జ్వర్రమొచ్చింది, జ్వర్రమొచ్చింది అనే సాంగ్ లో స్టెప్పులేసింది ఈ అమ్మడు. అలాగే బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే దేవుడు చేసిన మనుషులు సినిమాలోనూ నటించింది. కాగా ఇప్పుడు ఈ అమ్మడు ఏం ఎవరు.? ఎలా ఉంది అని నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ఫోటోలు వైరల్ గా మారాయి.