అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు. కానీ ఈ టాలెంటడ్ హీరో అంతగా క్లిక్ అవ్వలేదు. కెరీర్ లో కొన్ని క్లాసిక్ హిట్స్ అందుకున్నప్పటికీ ఎందుకో ఆయన స్టార్ హీరోగా రాణించలేకపోయారు. ఇక సుమంత్ ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు కానీ ఒకానొక సమయంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో ఎవరు గ్రీన్ గా నిలిచిపోయే సినిమా ప్రేమకథ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందమైన ప్రేమ కథతో పాటు, యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సుమంత్ సరసన నటించిన అమ్మడు గుర్తుందా..? ఆమె పేరు అంతరా మలి.
ప్రేమకథ సినిమాలో తన అందంతో ఈ అమ్మడు ఆకట్టుకుంది. అలాగే నటనపరంగానూ మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి అంతరా మలి బాలీవుడ్ హీరోయిన్. అక్కడ ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఇదే. ధూండతే రెహ్ జావోగే అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా మారింది అంతరా మలి. ఆ తర్వాత ప్రేమ కథ సినిమా చేసింది. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంది.
అంతరా మలి చివరిగా ఎండ్ వన్స్ ఎగైన్ అనే హిందీ సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉందా.? అని కొందరు నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆమె చాలా మారిపోయింది. సడన్ గా చూస్తే గుర్తుపట్టడం కష్టమే. చూస్తే మీరే షాక్ అవుతారు. ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.