ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. షారుఖ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే తారగా ఓ వెలుగు వెలిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. కానీ ఇప్పటికీ కథానాయికగానే మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తుంది. అయితే ఈ ఏడాది ఒకే ఒక్క సినిమాలో నటించిన ఆ హీరోయిన్.. ఏకంగా రూ.20 కోట్లు పన్ను చెల్లించదట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే బీటౌన్ బ్యూటీ కరీనా కపూర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పెళ్లి, పిల్లల తర్వాత నటి కరీనాకపూర్ మునుపటిలా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా లేరు. అటు బిజినెస్ రంగంలో చురుగ్గా ఉంటున్న కరీనా.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె మొదటి స్థానంలో ఉంది.
తక్కువ సినిమాలే చేసినా ఇండస్ట్రీపై చాలా శ్రద్ధ పెట్టింది కరీనా. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తనకు ఓ సొంత బ్రాండ్ కూడా కలిగి ఉంది. అయితే నివేదికల ప్రకారం కరీనా ఈ ఏడాది రూ.20 కోట్లు పన్ను చెల్లించందట. అవును.. కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తుంది కరీనా. హీరో సైఫ్ తో తన వివాహం తర్వాత ఆమె పూర్తిగా వ్యాపార రంగంపై దృష్టి పెట్టింది.
కరీనా తర్వాత అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్ కియారా అద్వానీ. ఈ ఏడాది రూ.12 కోట్లు పన్ను చెల్లించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది. ఇక మూడో స్థానంలో కత్రినా కైఫ్ నిలించింది. రూ.11 కోట్లు పన్ను కట్టింది. టాక్స్ పేయర్ హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన మొత్తం 92 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్. 75 కోట్లు చెల్లించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.