Vijay Thalapathy: విజయ్ తలపతి కూతురిని చూశారా.. ? చిన్నప్పుడే తండ్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..

విజయ్ తలపతి.. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చెపట్టేందుకు రెడీ అయ్యాడు ఈ కోలీవుడ్ హీరో. పార్టీ ప్రారంభించిన రెండేళ్లలో అత్యధిక మెజారిటీ అందుకుని తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే విజయ్ తలపతి వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగుతున్న విషయం తెలిసిందే.

Vijay Thalapathy: విజయ్ తలపతి కూతురిని చూశారా.. ? చిన్నప్పుడే తండ్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందంటే..
Vijay Thalapathy

Updated on: May 07, 2026 | 8:04 AM

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పేరుతో సంచలనం సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్. పార్టీ స్థాపించిన రెండేళ్లకే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక ఓటింగ్ అందుకుని చరిత్ర క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అటు విజయ్ సినిమాలతోపాటు ఆయన వ్యక్తిగత జీవితం గురించి సైతం ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విడాకులు కావాలంటూ విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ తనయుడు జైసన్ సినిమాలు, ఇన్ స్టా గురించి నెట్టింట చర్చ జరిగింది. ఇక ఇప్పుడు విజయ్ కూతురి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. విజయ్ కూతురు దివ్య సాషా ప్రస్తుతం ఎక్కడున్నారు.. ? ఏం చేస్తున్నారు ? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తలపతి విజయ్ కుమార్తె దివ్య సాషా . 2005 సెప్టెంబర్ 9న చెన్నైలో జన్మించిన ఆమె, ప్రస్తుతం 20 సంవత్సరాలు. దివ్య సాషా ప్రధానంగా తన ఉన్నత విద్యపై దృష్టి పెడుతూ, వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుంది. ఆమె ఆడంబరమైన ప్రపంచానికి దూరంగా ఉంటుంది. చదువుతో పాటు, దివ్య అథ్లెటిక్స్‌పై కూడా శ్రద్ధ చూపుతుంది. ఇదివరకే బాలనటిగా వెండితెరకు పరిచయమైంది దివ్య సాషా. 2016లో విజయ్ నటించిన తేరి చిత్రంలో దివ్య అతిథి పాత్రలో కనిపించింది. ఈ మూవీతో వెండితెరకు చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైంది.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

తేరి సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంది దివ్య. దివ్య చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ (AISC)లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. అలాగే ఆమె అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరు సంపాదించుకుంది. 2024–2025 నాటికి, ఆమె ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళినట్లు సమాచారం.సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది దివ్య.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

విజయ్ తలపతి కూతురు..

Divya Sasha

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us