Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా గతంలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..
Trivikram

Updated on: Jan 23, 2026 | 6:35 AM

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రూపొందించిన చిత్రాలకు తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రతిభ, అంకితభావం, వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు.”అరవింద సమేత” చిత్రానికి మొదలు, మధ్యం, చివర అన్నీ నందమూరి తారక రామారావే అని ఆయన పేర్కొన్నారు. ప్రతీ తరంలోనూ ఇంత బలమైన నటుడిని చూడటం చాలా అరుదని త్రివిక్రమ్ అన్నారు. నటనకి సంబంధించి జూనియర్ ఎన్.టి.ఆర్. ఒక టార్చ్ బేరర్ అని అభివర్ణించారు. ఎలాంటి కఠినమైన సన్నివేశమైనా, క్లిష్టమైన భావోద్వేగానైనా ఆయన తక్కువ సమయంలో అద్భుతంగా పలికించగలరని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..

అరవింద సమేత చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఉదాహరణగా చూపిస్తూ, తండ్రి పక్కన కూర్చుని ఎమోట్ చేయాల్సిన కార్ లోపల సన్నివేశాన్ని జూనియర్ ఎన్.టి.ఆర్. కేవలం 10-15 నిమిషాల్లోనే పూర్తి చేశారని, అందుకు ఒక ఆఫ్ డే గానీ, ఒక రోజు గానీ అదనంగా తీసుకోలేదని త్రివిక్రమ్ తెలిపారు. దీనికి రామ్-లక్ష్మణ్ మాస్టర్లే సాక్ష్యమని, వారు ఆ షాట్ పూర్తయిన తర్వాతే బయలుదేరి చెన్నైకి వెళ్లారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ క్షణంలో పాత్రలో పూర్తిగా లీనమైపోవడం జూనియర్ ఎన్.టి.ఆర్. గొప్ప లక్షణమని, అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని దర్శకుడు అన్నారు. తన తాతగారి పేరు నిలబెట్టడమే కాకుండా, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న నటుడు ఎన్.టి.ఆర్. అని, ఆయన తనకు అత్యంత ఇష్టమైన హీరో అని త్రివిక్రమ్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, అవసరమైన విషయాన్ని కూలంకషంగా సాధించడం వంటి అద్భుతమైన లక్షణాలు జూనియర్ ఎన్.టి.ఆర్.లో ఉన్నాయని త్రివిక్రమ్ ప్రశంసించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు జూనియర్ ఎన్.టి.ఆర్.ను “కెమెరా కోసం పుట్టాడు” అని తరచుగా చెబుతారని, ఆయన కెమెరా ముందు నటిస్తుంటే మిగిలిన వారందరూ తెలియకుండానే పక్కకు జరుగుతారని పేర్కొన్నారు.

Trivikram, Jr.ntr

ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..