సమంతను హీరోయిన్‌గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు.. షాకింగ్ విషయం చెప్పిన సుకుమార్

రామ్ చరణ్ కెరీర్ బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్‌కు ఆ రేంజ్ హిట్ ఇచ్చిన రంగస్థలం సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

సమంతను హీరోయిన్‌గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు.. షాకింగ్ విషయం చెప్పిన సుకుమార్
Sukumar

Updated on: Apr 02, 2026 | 9:16 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతం అనే చెప్పాలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. చరణ్ వినికిడి సమస్య ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు. చరణ్ అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు.

అలాగే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రమాలక్ష్మి పాత్రలో చిట్టిబాబు ప్రేమికురాలిగా నటించింది. అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. సమంత పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రంగస్థలం సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవడం తనకు ఇష్టం లేదని సుకుమార్ అన్నారు. ఎవరైనా కొత్త హీరోయిన్.. లేదా ఓ నార్మల్ అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నా అని సుకుమార్ తెలిపారు.

చరణ్, సమంత ఇద్దరూ స్టార్సే.. ఇద్దరు స్టార్స్ ను పెట్టుకొని మేనేజ్ చేయలేనేమో అనుకున్నా.. కానీ సమంత ఒకొక్క సీన్ లో అద్భుతంగా నటించింది. సమంత నటన చూసినప్పుడల్లా నా చెంప చెళ్లు మనిపించినట్టు అనిపించింది. ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యా.. ఆమెతో సినిమాలు చేస్తూనే ఉండాలనిపించింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ అదే చెప్పా అని సుకుమార్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us