
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు పూరీ కుమార్తె పవిత్ర మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపై సందడి చేసిన పవిత్ర.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తనలోని అద్భుతమైన చిత్రకళా ప్రావీణ్యాన్ని (ఆర్టిస్టిక్ టాలెంట్) బయటపెడుతూ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సాధారణంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిపై పెద్దగా నమ్మకం లేదనే విషయాన్ని తన ‘మ్యూజింగ్స్’ ద్వారా, పలు ఇంటర్వ్యూలలో తరచూ వెల్లడిస్తుంటారు. అయితే ఆయన కూతురు పవిత్ర మాత్రం శివునిపై ఎంతో ఆధ్యాత్మిక భావనను, భక్తిని పెంపొందించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే తనకు కలలో కేదారనాథ్ శివుడు కనిపించాడని, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని క్యాన్వాస్‌పై చిత్ర రూపంలోకి తెచ్చానని పవిత్ర తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
తన చిత్రలేఖనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తూ.. “కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్‌తో మండల (Mandala) చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేను ఎక్కడో నేర్చుకున్న నైపుణ్యం కాదు, నాలో సహజంగా పుట్టుకొచ్చిన ఒక అభిరుచి. అయితే ఇటీవల కేదారనాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది ఏదో సాధారణ కలలా అనిపించలేదు, సాక్షాత్తు శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే తర్వాతి రోజే కేదారనాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను” అని పవిత్ర వెల్లడించింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
దాదాపు వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు పవిత్ర పేర్కొంది. ప్రతి గీతలోనూ ఒక ప్రార్థనను, ప్రతి ఆకృతిలోనూ ఒక భావాన్ని, ప్రతి రంగులోనూ తన భక్తిని నింపుతూ ఈ కేదారనాథ్ చిత్రాన్ని తీర్చిదిద్దింది. ఈ చిత్రం పూర్తయ్యాక తన మనసులో చెప్పలేని ప్రశాంతత లభించిందని తెలిపింది. మొదట ఈ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నప్పటికీ, ఇప్పుడు శివుని పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతో అభిమానులందరితో షేర్ చేసుకుంటున్నానని పేర్కొంటూ “హర హర మహాదేవ్” అని రాసుకొచ్చింది. పవిత్ర తాను గీసిన కేదారనాథ్ ఆలయ చిత్రంతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆమెలోని ఈ దాగి ఉన్న నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు , సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..