Lokesh Kanagaraj: పెద్ద ప్లానే ఇది.. బాలీవుడ్ స్టార్ హీరోతో లోకేష్ కానగరాజ్ సినిమా..

ఒక సినిమా కథకు మరో సినిమా కథకు లింక్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు లోకేష్. దళపతి విజయ్ హీరోగా నటించిన కత్తి, మాస్టర్ అలాగే లియో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ లియో సినిమా తర్వాత ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Lokesh Kanagaraj: పెద్ద ప్లానే ఇది.. బాలీవుడ్ స్టార్ హీరోతో లోకేష్ కానగరాజ్ సినిమా..
Lokesh Kanagaraj

Updated on: Aug 20, 2024 | 6:35 PM

సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు లోకేష్. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్ పేరుతో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా కథకు మరో సినిమా కథకు లింక్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు లోకేష్. దళపతి విజయ్ హీరోగా నటించిన కత్తి, మాస్టర్ అలాగే లియో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ లియో సినిమా తర్వాత ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ విడుదలై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.

ఇది కూడా చదవండి : Double Ismart : ఎంత పని చేశావ్ ‘బొక’..! డబుల్ ఇస్మార్ట్‌లో బెడిసికొట్టిన అలీ కామెడీ.. ఆ సీన్స్ డిలీట్.?

లోకేష్ దర్శకత్వంలో విడుదలైన చివరి సినిమా లియో, అంతకుముందు విడుదలైన విక్రమ్ సినిమా రెండూ ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలా మాదిరిగానే కూలి సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎల్‌సీయూ సినిమాల్లో నటించిన నటీనటులు కూలీలో ఉంటారని, అయితే ఇది ఎల్‌సీయూ సినిమా కాదని అన్నారు. కూలీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి :Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ రీసెంట్ గా ఓ ఫోటోను విడుదల చేశారు. అందుకు సంబంధించి నటుడు రజనీకాంత్‌తో దిగిన ఫోటోను లోకేష్ తన ఎక్స్ సైట్ పేజీలో షేర్ చేశారు. అందులో కూలీ చిత్రానికి రజనీ లుక్ టెస్ట్ జరిగింది. కూలీ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతోంది. లోకేశ్ కనగరాజ్ తెలిపిన వివరాల ప్రకారం కూలీ వచ్చే ఏడాది వేసవి పండుగ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత, కార్తీ తదుపరి చిత్రం ఖైదీ 2కి దర్శకత్వం వహించబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ఇండియన్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. చర్చల్లో సినిమా కన్ఫర్మ్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Follow Us