AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్.. కన్ఫార్మ్ చేసిన డైరెక్టర్ అట్లీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ (జవాన్ ఫేమ్) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' (Raaka). సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రష్మిక మందన్న ఒక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Allu Arjun : అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్.. కన్ఫార్మ్ చేసిన డైరెక్టర్ అట్లీ..
Allu Arun
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 2:35 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ పైన ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.. ఈ క్రేజీ చిత్రానికి ‘రాకా’ (Raaka) అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదలైన టైటిల్ పోస్టర్ సైతం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోజు రోజుకీ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం యువ నటి ప్రీతి ముకుందన్‌ను మొదట సంప్రదించారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ మిస్సైనట్లు ప్రచారం నడించింది. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ అట్లీ స్పందించారు. నెట్టింట వినిపిస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఈ భారీ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

ఇటీవల జరిగిన తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా ‘హృదయం మురళి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అట్లీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. “నేను ప్రీతి ముకుందన్ నటనకు పెద్ద అభిమానిని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రాకా’లో ఒక కీలకమైన , ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం మొదట ఆమెనే సంప్రదించాను. కానీ ఆ సమయంలో ఆమె ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండటం వల్ల మా సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ఆమె ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకోవాల్సి వచ్చింది” అని అట్లీ వివరించారు. ప్రీతి ముకుందన్ తిరస్కరించిన ఆ కీలక పాత్రను ప్రస్తుతం మలయాళ నటి ఫెమినా జార్జ్ (మిన్నల్ మురళి ఫేమ్) దక్కించుకున్నట్లు అట్లీ స్పష్టం చేశారు. అయితే ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుంది, సినిమాలో ఆమె ప్రాధాన్యత ఏమిటనే విషయాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

ప్రీతి ముకుందన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ‘కన్నప్ప’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇటీవలే విడుదలైన ‘బ్లాస్ట్’ చిత్రంతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘హృదయం మురళి’ చిత్రం జులై 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఏదేమైనప్పటికీ, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని ప్రీతి మిస్ చేసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ చిత్రంపై అటు అల్లు అర్జున్ అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రీతి ముకుందన్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

Follow Us
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
రాత్రంతా నిద్రపోయినా ఉదయాన అలసటగా ఉంటోందా..?
రాత్రంతా నిద్రపోయినా ఉదయాన అలసటగా ఉంటోందా..?
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్