Anil Ravipudi: డైరెక్టర్ కాదు సర్ మీరు హీరో అవ్వాల్సింది.. బాలయ్య పాటకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరే స్టెప్స్..

కేవలం దర్శకుడిగానే కాకుండా.. అనిల్ రావిపూడి మల్టీటాలెంటెడ్ . సినిమాలు.. లేదా వేరే చిత్రాల ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్, షోస్ ఇలా ఎక్కడున్నా తన మాటలతో.. కామెడీతో తెగ నవ్వించేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. కేవలం కామెడీ, డైరెక్షన్ మాత్రమే కాదండోయ్.. ఆయన మంచి డ్యాన్సర్ కూడా.

Anil Ravipudi: డైరెక్టర్ కాదు సర్ మీరు హీరో అవ్వాల్సింది.. బాలయ్య పాటకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరే స్టెప్స్..
Anil Ravipudi

Updated on: May 18, 2023 | 4:26 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. హీరోతోపాటు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అనిల్ ఎక్కడుంటే అక్కడ అల్లరి ఉండాల్సిందే. తనదైన కామెడీ పంచులతో వెండితెరపైనే కాకుండా రియాల్టీలోనూ తన పక్కనవారిని నవ్విస్తుంటారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. అనిల్ రావిపూడి మల్టీటాలెంటెడ్ . సినిమాలు.. లేదా వేరే చిత్రాల ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్, షోస్ ఇలా ఎక్కడున్నా తన మాటలతో.. కామెడీతో తెగ నవ్వించేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. కేవలం కామెడీ, డైరెక్షన్ మాత్రమే కాదండోయ్.. ఆయన మంచి డ్యాన్సర్ కూడా. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అదిరే స్టెప్స్ వేశారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్‏లోనే అతను ఫైట్ డ్యాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య బాటు పాటకు స్టెప్పులేశారు. బాలయ్య… బాలయ్యా అంటూ సాగే ఈ పాటకు ఫైర్ మాస్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. మధ్యలో డ్యాన్స్ మాస్టర్ కూడా జాయినయ్యాడు అని చెబుతూ.. వారితో కలిసి డాన్స్ చేశారు అనిల్ రావిపూడి. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మరో రీల్.. మరో మాస్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు డైరెక్టర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఈ వీడియోకు చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు హీరోగా ట్రై చేస్తే బాగుంటుందని.. మంచి డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ అని.. మల్టీటాలెంటెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ చేస్తుండగా.. ఇందులో కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.