Charan Raj: 500కు పైగా సినిమాల్లో నటించిన ఈ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన కొడుకు కూడా తెలుగులో ఫేమస్ హీరో

పేరుకు కన్నడ నటుడే అయినా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించాడు చరణ్ రాజ్. తన అద్బుతమైన విలనిజంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఓవరాల్ గా దాదాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించిన చరణ్ రాజ్ కుమారుడు కూడా ఇప్పుడు ఫేమస్ నటుడున్న సంగతి చాలా మందికి తెలియదు.

Charan Raj: 500కు పైగా సినిమాల్లో నటించిన ఈ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన కొడుకు కూడా తెలుగులో ఫేమస్ హీరో
Charan Raj

Updated on: Oct 15, 2026 | 8:05 PM

టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్లలో చరణ్ రాజ్ ఒకరు. ఈతరం జనరేషన్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ముఖ్యంగా 90స్ కిడ్స్‌కు ఈ స్టార్ విలన్ గురించి బాగా తెలుసు. తెలుగుతో సహా కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించారు చరణ్ రాజ్. కన్నడ సినిమాలోతనే కెరీర్ ప్రారంభించిన ఆయన 1985లో ‘ప్రతిఘటన’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో విజయశాంతికి ధీటుగా కాళిదాసుగా విలనిజాన్ని పండించి అందరి ప్రశంసలు అందుకున్నారు చరణ్ రాజ్. ఈ సినిమాతో విజయ శాంతికి ఎంత పేరొచ్చిందో .. విలన్‌గా నటించిన చరణ్‌ రాజ్‌కు కూడా అంతే పేరొచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో చరణ్ రాజ్ కు సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. అరణ్యకాండ, దొంగ మొగుడు, జెంటిల్మెన్ స్వయంవరం, భలే దొంగ, స్టూవర్ట్ పురం దొంగలు, సూర్య ఐపీఎస్, నా అల్లుడు, అతడు, అసాధ్యుడు, కరెంట్, కొమరం పులి, పరమవీర చక్ర, అధినాయకుడు, పైసా, నరకాసుర, ఆపరేషన్ రావణ్, లాల్ సలామ్, నరకాసుర.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు చరణ్ రాజ్. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని ఇలా ఎందరో స్టార్ హీరోల తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన కెరీర్ లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించిన చరణ్ రాజ్ జెంటిల్మెన్ వంటి సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించారు.

 

సినిమాల పరంగా తప్పితే చరణ్ రాజ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఆయన కూడా తన కుటుంబం గురించి బయట ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. చరణ్ రాజ్ కుమారుడు కూడా ఇప్పటికే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. హీరోగానూ, సహాయక నటుడిగానూ రాణిస్తున్నాడు.చరణ్ రాజ్ కుమారుడి పేరు తేజ్ చరణ్ రాజ్. 2017లో తమిళంలో వచ్చిన లాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 90ml, శ్రీ భారత బాహుబలి అనే తమిళ్ సినిమాల్లోనూ నటించాడు. సివి 2 అనే కన్నడ సినిమాలోనూ మెరిశాడు. ఇక 2023లో రిలీజైన నరకాసుర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించాడు. ఈ సినిమాలో తేజ్ ఆదినాయుడిగా నటించాడు చరణ్ రాజ్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే నరకాసుర సినిమాలో చరణ్ రాజ్ కూడా నటించారు. చరణ్ రాజ్ కొడుకుగానే ఈ సినిమాలో తేజ్ నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తేజ్ చరణ్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. దీని తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేశాడీ స్టార్ కిడ్. ప్రస్తుతం తన కుమారుడిని నటుడిగా నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు చరణ్ రాజ్.

ఇవి కూడా చదవండి

Actor Charan Raj

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us