Jabardasth: మొన్నటివరకు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మొన్నటివరకు ఇతను జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగాడు. కామెడీ పంచులు వేస్తూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఇప్పుడదే జబర్దస్త్ కమెడియన్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెబుతూ వారి భవిష్యత్ కు పునాది వేస్తున్నాడు.

Jabardasth: మొన్నటివరకు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Jabardasth Comedian

Updated on: May 12, 2026 | 8:12 PM

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షోల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ కామెడీ షో చూస్తుంటారని వారే సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ షో గురించి మరో పాజిటివ్ అంశం ఏమిటంటే.. ఎంతో మంది నటీనటులకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ టీవీ షో ఒక చక్కని వేదికగా నిలుస్తోంది. జబర్దస్త్ లో కమెడియన్లుగా చేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, హాస్యనటులుగా అలరిస్తున్నారు. యాంకర్ అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి.. ఇలా ఎంతో మంది ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇదే జబర్దస్త్ వేదికపై స్టార్ కమెడియన్ గా రాణించిన ఒక నటుడు ఇప్పుడు మాస్టార్ గా మారిపోయాడు. మొన్నటివరకు కామెడీ పంచులు వేసే అతను ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. బుల్లి తెరకు పూర్తిగా బై బై చెప్పేసి విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ వారి భవిష్యత్ కు పునాది వేస్తున్నాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా?

‘జబర్దస్త్’ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లలో హైపర్ ఆది టీమ్ ఒకటి. ఈ టీమ్ లో ఎత్తుగా, బొద్దుగా కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గణపతి మాస్టర్. చాలా స్కిట్ లలో కూడా టీచర్‌గా, స్టూడెంట్ గా కనిపించి నవ్వులు పూయించారాయన. అలాగే లేడీ గెటప్పుల్లోనూ ఆకట్టుకున్నారు. జబర్దస్త్ లోనే కాదు పలు సినిమాల్లో కూడా కమెడియన్‌గా నటించి మెప్పించారు గణపతి మాస్టర్. అయితే ఇప్పుడాయన తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 1998లో డీఎస్సీలో ఎంపికైన కొందరు అభ్యర్థులకు 2023లో ప్రభుత్వం పోస్టింగ్ లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో జబర్దస్త్ గణపతి కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం పాఠశాలల్లో టీచర్ గా చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నారట గణపతి. అందులో భాగంగానే జబర్దస్త్‌ కు రాకముందు కూడా కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారట. ఇక మూడేళ్ల క్రితం ఆయనకు ప్రభుత్వ పాఠశాల టీచర్ గా పోస్టింగ్ రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

 విధి నిర్వహణలో జబర్దస్త్ నటుడు గణపతి

ప్రస్తుతం స్కూల్ టీచర్ గా పిల్లలకు పాఠాలు చెబుతూనే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు గణపతి మాస్టర్. అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్యూమరేటర్ గా పనిచేస్తూ జనాభా లెక్కలు సేకరిస్తున్నారు గణపతి మాస్టర్

టీచర్స్ డే వేడుకల్లో గణపతి మాస్టర్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us