
పై ఫొటోలో బూట్ కట్ ప్యాంట్ ధరించి స్టైల్ గా పోజులిస్తోన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను జబర్దస్త్ స్టార్ కమెడియన్. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. కాగా ఇతనికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేద. అందుకే తన చెల్లెలు ఇచ్చిన కొంత డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఓ టీవీషోలో పాల్గొన్నాడు. తన మిమిక్రీ ట్యాలెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ సరైన అవకాశాలు రాకపోవడంతో వరంగల్‌కు వెళ్లిపోయాడు. అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉద్యోగిగా చేరాడు. కొంతకాలం ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ దగ్గర పనిచేశాడు. ఏమైందో తెలియదు కానీ మున్సిపల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దుబాయ్‌కి వెళ్లి రేడియో జాకీగా పనిచేశాడు. అందులో ‘నవ్వుల నల్లబాలు’ పేరుతో తెలంగాణ యాసలో కార్యక్రమాలు చేసి, విశేష ఆదరణ పొందాడు. ఆపై మళ్లీ హైదరాబాద్‌కి వచ్చాడు. అదే సమయంలో జబర్దస్త్ కార్యక్రమం కోసం చమ్మక్ చంద్ర ఇంటిలో జరిగిన ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యాడు. అంతే.. ఆ తర్వాత అతనికి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోన్న ఆ కమెడియన్ మరెవరో కాదు రచ్చ రవి.
రచ్చ రవిది హన్మకొండ. అక్కడి విద్యాని కేతన్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఎస్.వి.ఎస్. జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ చదివాడు. ఆపై కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు. దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ (2013) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రచ్చ రవి. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, శతమానం భవతి, గద్దల కొండ గణేష్, బలగం, ఓం భీమ్ భుష్, అఖండ 2 తదితర సినిమాలు రవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక గతేడాది ఏకంగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించాడీ స్టార్ కమెడియన్. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ స్టార్ నటుడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.