
మహానటి సావిత్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇప్పుడు ఆమె మనతో లేకపోయినా తన సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. తన అందం, అభినయంతో సుమారు 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సేవలందించారామె. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె మహానటిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. అయితే సినిమాల్లో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. చేతినిండా సినిమాలతో జీవితం సాఫీగా సాగిపోతున్న టైమ్ లోనే.. జెమినీ గణేషన్ ను రహస్య వివాహం చేసుకున్నారు సావిత్రి. ఇదే ఆమె జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు, భర్తతో విభేదాలు, నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, కోట్ల ఆస్తులు ఇట్టే కరిగిపోవడంతో సావిత్రి ఉక్కిరిబిక్కిరైపోయారు. దీంతో క్రమంగా ఆల్కహాల్ కు బానిసయ్యారామె. అయితే సావిత్రికి స్వతహాగా ఈ తాగే అలవాటు లేదట. కానీ ఆమె ఇబ్బందులు, ఒత్తిడిని ఆసరాగా చేసుకుని ఎప్పుడూ తన చుట్టూ ఉండే కొంత మంది సావిత్రికి మద్యం అలవాలు చేశారని సమాచారం. ముఖ్యంగా సావిత్రికి మందు అలవాటుగా మార్చింది మాత్రం జెపీ చంద్రబాబు అని తెలుస్తుంది. నటుడు, నిర్మాత అయిన జేపీ చంద్రబాబు సినిమాల్లో నష్టాలు రావడంతో మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడట. ఆ తర్వాత తనకున్న ఈ తాగుడు అలవాటిని సావిత్రికి కూడా అంటించాడట.
కాగా మత్తుకు పూర్తిగా బానిసైన సావిత్రి చాలా సార్లు షూటింగ్స్ కి కూడా తాగి వచ్చేవారట. అలా విచిత్ర దాంపత్యం సినిమా షూటంగ్ టైమ్ లో కూడా సావిత్రి ఫుల్ గా తాగి షూటింగ్ కు వెళ్లారట. ఈ సినిమాలో శోభన్ బాబు హీరో కాగా, విజయ నిర్మల హీరోయిన్ గా నటించింది. గుమ్మడి భార్యగా సావిత్రి ఈ సినిమాలో సహాయక నటిగా కనిపించారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు ఫుల్ గా తాగి వెళ్లిన సావిత్రి అక్కడే వాంతి చేసుకున్నారట. దీంతో అక్కడే ఉన్న విజయ నిర్మల సావిత్రిని మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారట.
సావిత్రి లేనిదే ఆమె సీన్స్ షూటింగ్ చేయడం కుదరు కాబట్టి.. డైరెక్టర్ కూడా షూటింగ్ కు పేకప్ చెబుదామనుకున్నాడట. అయితే తాను అర్ధగంటలో మళ్లీ వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతానని సావిత్రమ్మ కబురు పెట్టారట. అలా మద్యం అలవాటు ఉన్నప్పటికీ తన పనిలో మాత్రం ఏ లోటు రాకుండా, నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బందులు కలగకుండా చూసుకునే వారట సావిత్రి. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బయట పెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.