షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోలుగా నిలదొక్కుకున్నారు. పైన కనిపిస్తున్న హీరో కూడా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు వందకోట్ల హీరోగా ఎదిగాడు ఆ హీరో.

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు.. ఎవరో గుర్తుపట్టారా..?
Hero
Follow us

|

Updated on: Apr 19, 2024 | 11:29 AM

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభంకాదు. ఎంతో మంది హీరోలు నానా కష్టాలు పడి స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాలు రాబట్టుకొని హీరోలుగా ఎదిగి ఇప్పుడు రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోలుగా నిలదొక్కుకున్నారు. పైన కనిపిస్తున్న హీరో కూడా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు వందకోట్ల హీరోగా ఎదిగాడు ఆ హీరో. అంతే కాదు ఓసారి షూటింగ్ నుంచి గెంటేశారు కూడా ఆయనను. అంతే కాదు మగడు అయ్యి ఉండి కూడా క్యాస్టింగ్ కౌచ్ కు కూడా గురయ్యాడు అతను. ఇంతకు ఆయన ఎవరో గుర్తు పట్టరా..?

పై ఫొటోలో కనిపిస్తున్న హీరో ఇప్పుడు వందకోట్ల హీరో.. ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇంతకు ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.  ఈ యంగ్ హీరోకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. బాజీరావు మస్తానీ, గల్లీ బాయ్, పద్మావత్, సింగం 2 వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు రణవీర్ సింగ్.

ఈ స్టార్ హీరో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రణవీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చిన్నగా ఉన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ కు వెళ్లాను. అక్కడ రవీనా టాండన్ ను చూస్తూ ఉండిపోయాను.. కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నాను. అయితే ఆమె దానికి ఇబ్బంది పడింది. దాంతో సెక్యూరిటీకి చెప్పి నన్ను అక్కడి నుంచి పంపించేయమని చెప్పింది. దాంతో వాళ్లు నన్ను షూటింగ్ నుంచి గెంటేశారు దాంతో నేను చాలా బాధపడ్డాను. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత నన్ను కలవాలి అన్నాడు. ఆయన రూమ్ కు వెళ్లిన తర్వాత అతను నాతో తేడాగా ప్రవర్తించాడు. నేను నో చెప్పను కనీసం తాకడానికైనా, చూడటానికైనా ఓకే చెబుతావా? అని నన్ను బ్రతిమిలాడాడు. నేను కుదరదు అని చెప్పగానే అతను ఎంతో బాధపడ్డాడు అని చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్. ఇప్పుడు రణవీర్ సింగ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఈయన సినిమాలు వందకోట్లు అవలీలగా వసూల్ చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.