Tollywood : అప్పుడు ప్రాణ స్నేహితులు.. ఇప్పుడు సీఎం vs ప్రతిపక్ష నేతలు.. కాలం మారడం అంటే ఇదే..

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేతబట్టారు దళపతి విజయ్. నాటకీయమైన రాజకీయ పరిణామాల మధ్య నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే )పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో విజయ్ పక్కన ఉన్న కుర్రాడిని గుర్తుపట్టేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Tollywood : అప్పుడు ప్రాణ స్నేహితులు.. ఇప్పుడు సీఎం vs ప్రతిపక్ష నేతలు.. కాలం మారడం అంటే ఇదే..
Udayanidi Stalin, Vijay

Updated on: May 11, 2026 | 1:18 PM

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం తీసిన ఈ పాత ఫోటో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు యువకులు మరెవరో కాదు.. ఒకరు ద్రవిడ మున్నే్ట్ర కజగం (డీఎంకే)కు పార్టీ నాయకుడు ఉదయనిధి స్టాలిన్, మరొకరు కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్. పైన కనిపిస్తున్న ఫోటోలో విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి నవ్వుతూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు విజయ్ , ఉదయనిధి స్టాలిన్ మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఉదయనిధి తన సినీ నిర్మాణ సంస్థ ‘రెడ్ జెయింట్ మూవీస్’ ద్వారా విజయ్ నటించిన ‘కురువి’ వంటి చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఒకప్పుడు సినిమా వేదికలపై కలిసి కనిపించిన ఈ ఇద్దరు యువ నేతలు, ఇప్పుడు రాజకీయ రణరంగంలో ముఖాముఖి అధికార, ప్రతిపక్ష నేతలుగా మారారు. మరోవైపు, వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇటీవల తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీని సంపాదించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రస్తుతం విజయ్, ఉదయనిధి స్టాలిన్ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారగా.. ఒక నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే 20 సంవత్సరాలు వారి చుట్టే తిరుగుతాయి.. యువ నాయకులు బాధ్యతలు స్వీకరించడం చూడటం సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ (MGR) , కరుణానిధి మధ్య కూడా ఇలాంటి స్నేహం, ఆ తర్వాత రాజకీయ వైరం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో విజయ్ , ఉదయనిధి స్టాలిన్ తలపడ్డారు. “అప్పుడు భుజం భుజం కలిపి నవ్విన వారు, ఇప్పుడు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నారు” అని నెటిజన్లు ఈ వైరల్ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us