
మాములుగా సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తాయి. సినిమా పెద్ద హిట్ అయితే మరో పదిరోజులు ఆలస్యం అవుతుంది అంతే.. కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ లో డిజాస్టర్ అయితే.. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. వారం రోజులు కూడా ఆగకుండా ఓటీటీ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేశారు. అలా అని మరీ చెత్త సినిమా కాదు. జనవరి 13న సినిమాను థియేటర్ల లోకి తీసుకొచ్చారు. 19న ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా ఏదంటే..
టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు కొదవే లేదు.. చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల్లో మలయాళం సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలా మలయాళం సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే విడుదలైన ఓ మలయాళం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా మరేదో కాదు చథా పచ్చ. ఈ సినిమా జనవరి 13న విడుదలైంది.
రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ నటించారు. అయితే ఈ సినిమా మలయాళంలో గత నెల 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే అదే సమయంలో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు తెలుగులో ఈ సినిమాను జనవరి 13న విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా వచ్చేసింది. జనవరి 19న చథా పచ్చ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలా తెలుగులో విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది చథా పచ్చ సినిమా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి