Rakesh Bedi : స్టేజ్ పై హీరోయిన్ భుజంపై ముద్దు.. అసలు విషయం చెప్పిన ధురంధర్ 2 నటుడు..

ధురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సినిమా. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ఎంతగా వస్తుందో.. అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తమను అవమానించారంటూ సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధురంధర్ 2 నటుడు రాకేష్ బేడీ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

Rakesh Bedi : స్టేజ్ పై హీరోయిన్ భుజంపై ముద్దు.. అసలు విషయం చెప్పిన ధురంధర్ 2 నటుడు..
Rakesh Bedi

Updated on: Mar 25, 2026 | 8:41 AM

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ 2. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. బీటౌన్ హీరో రణవీర్ కపూర్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమాకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. అయితే ధురంధర్ చిత్రంలో రణవీర్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయిన పాత్ర జమీల్ జమాలీ . ఈ పాత్రలో నటించింది నటుడు రాకేష్ బేడీ. తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో తన నటనతో అదరగొట్టేశారు. అయితే ఇటీవల ధురంధర్ ట్రైలర్ వేడుకలో రాకేశ్ బేడీ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఈ వేడుకలో ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ను భుజంపై ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ ను రాకేష్ బేడీ ముద్దుపెట్టుకోవడంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కొందరు అతడికి మద్దతు తెలుపగా.. మరికొందరు మాత్రం రాకేష్ బేడీ తీరును తప్పుబట్టారు. తాజాగా ఈ వివాదం పై రాకేష్ బేడీ స్పందించారు. తనకు సారా పై ఎలాంటి చేడు ఉద్దేశ్యం లేదని.. కేవలం తనపై ఆప్యాయంగానే అలా చేశానని అన్నా్రు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

“ఒక చిన్న సంఘటన జరిగింది. ‘ధురందర్’లో నా కూతురి పాత్ర పోషించిన సారా అర్జున్. షూటింగ్ సమయంలో, ఆమె వచ్చిన ప్రతిసారీ నేను ఆమెను కౌగిలించుకుని, నుదుటిపై ముద్దుపెట్టుకునేవాడిని – ఒక కూతురిలా, ‘టెన్షన్ పడకు, మనం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తాం అని చెప్పేవాడిని, కానీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నేను ఆమెను అదే విధంగా పలకరించినప్పుడు, జనాలు రకరకాలుగా రాయడం మొదలుపెట్టారు. అప్పుడు నేను, నేను ఆమెతో ఎప్పుడూ ఇలాగే ప్రవర్తించాను అని అనుకున్నాను. కానీ ఆ వీడియోను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. సారాను ఎప్పటికీ తాను ఒక కూతురిలాగే చూస్తానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us