Jailer 2 Movie : కుమారులతో కలిసి ‘జైలర్ 2’ సినిమా చూసిన ధనుష్.. రజనీకాంత్ గురించి ఏమన్నారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు దసరా ముందుగానే మొదలైంది. గురువారం (అక్టోబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జైలర్ 2' సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సామాన్యులతో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా జైలర్ 2 సినిమాను చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Jailer 2 Movie : కుమారులతో కలిసి జైలర్ 2 సినిమా చూసిన  ధనుష్.. రజనీకాంత్ గురించి ఏమన్నారంటే?
Rajinikanth, Dhanush

Updated on: Oct 15, 2026 | 3:35 PM

సుమారు మూడేళ్ల క్రితం ‘జైలర్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు సూపర్ స్టార్ రజనీకాంత్. నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులకు తెగ నచ్చేశాయి. ఇక జైలర్ కు సీక్వెల్ ప్రకటించగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా? అని అభిమానులు ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు జైలర్ 2 సినిమా గురువారం (అక్టోబర్ 15) థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. మొదటి పార్ట్ కు మించి జైలర్ 2 ఉందంటున్నారు. ఈ క్రమంలో సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సినిమా తారలు జైలర్ 2 థియేటర్లకు క్యూ కడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై రజనీ మేనియాను చూసి ఉప్పొంగిపోతున్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో నే జైలర్ 2 ను చూశారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ‘జైలర్ 2’ తప్పకుండా చూడాల్సిన సినిమా.. ఇది బ్లాక్‌బస్టర్.. తలైవా అభిమానులకు ఇదొక పండగ” అని పేర్కొంటూ ఫైర్ సింబల్స్ పోస్ట్ చేశారు.

ధనుశ్‌ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నటుడు విష్ణు విశాల్, నిర్మాత నాగవంశీ తదితర సినీ ప్రముఖులు కూడా జైలర్ 2 సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ‘తెరపై తలైవా మంటలు పుట్టించారు. ఆయన నుంచి కళ్లు తిప్పుకోలేకపోయాను. గూస్‌బంప్స్ ఓవర్‌లోడెడ్ మాస్ బ్లాస్ట్ ఇది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ అద్భుతం. అనిరుధ్ తన సంగీతంతో ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోశారు. ఒకే సినిమాలో మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విద్యాబాలన్, హృతిక్ రోషన్, ఎస్‌జే సూర్య వంటి వారిని చూడటం అద్భుతంగా ఉంది’ అని కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో ధనుష్, రజనీకాంత్ ఫ్యామిలీ..

ఇక టాలీవుడ్ నిర్మాత నాగవంశీ.. ‘ “సూపర్‌స్టార్ సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్, సెకండాఫ్ పోలికలకు తావులేదు. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద పెద్ద ధ‌మాకా ఖాయం. ‘జైలర్ 2’ ఆద్యంతం పీక్ మాస్ సంభవం లాంటి మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రతి యాక్షన్ బ్లాక్ అదిరిపోయింది. ఇది కుటుంబ ప్రేక్షకులకు పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్‌ను ప్రజెంట్ చేసిన విధానం, కథ, భావోద్వేగాలు అన్నీ పక్కాగా కుదిరాయి. రజనీ సర్ స్క్రీన్‌పై వెలిగిపోతుంటే, అనిరుధ్ తన పాటలు, బీజీఎంతో ప్రతి క్షణాన్ని ప్యూర్‌ ఫైర్‌వర్క్స్‌లా మార్చేశాడు” అని పేర్కొన్నారు.

నాగవంశీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us