
దక్షిణాది సంగీత దర్శకుడు ఇళయరాజాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘సరిగమ’ సంస్థకు సంబంధించిన పాటలను వాడొద్దంటూ ఆదేశించింది. కొంతకాలంగా ఇళయరాజాకు, సరిగమకు మధ్య జరుగుతున్న వివాదంలో ఇప్పుడు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేవరకూ 134 చిత్రాలకు సంబంధించిన పాటలను వాడుకోవడానికి వీల్లేదని ఆదేశాలిచ్చింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వు ప్రకారం, ఇళయరాజా, అతని ఏజెంట్లు, లేదా ఇతర సంబంధిత సంస్థలు సదరు సినిమా పాటలను ఉపయోగించడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
అసలు విషయానికి వస్తే.. 1976 నుంచి 2001 వరకూ ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల హక్కులను నిర్మాతలు సరిగమకు శాశ్వత ప్రతిపాదికన విక్రయించారు. అయితే ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఆ సినిమా పాటలను ఉపయోగించుకోవచ్చు అని కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు అనుమతులు ఇచ్చారు. దీంతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ చర్యలు చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కంపెనీ వాదించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పాటలను వాడుకోవడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 30 రోజుల్లోగా లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలని ఇళయరాజాను ఆదేశించారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
నిర్మాత నుంచి కొనుగోలు చేసిన తర్వాత పూర్తి హక్కులు సదరు సంస్థ సరిగమకే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించకూడదని పేర్కొంది. గతేడాది విడుదలైన అగత్యా సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజాకు, సరిగమకు మధ్య వివాదం నెలకొంది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వివాదం ముదురుతుంది. ఇప్పుడు ఆ సినిమా పాటలను ఇళయరాజా వాడుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు సినీరంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..