
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా డీసీ. ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇందులో హీరోగా నటించడం విశేషం. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ రా అండ్ రస్టిక్ మూవీని తెరకెక్కించాడు. ఆగస్టు 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. డీసీ సినిమా మొదటి వీకెండ్‌లోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడీ సినిమా టాక్ ఆప్ ది టౌన్ గా మారిపోయింది. అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన వామికా గబ్బి కూడా తెగ ట్రెండ్ అయిపోతోంది. డీసీ సినిమా సక్సెస్ నేపథ్యంలో వామికా చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెటిజన్ల మనసులు గెల్చుకుంటోంది.
డీసీ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు పలువురు నటీనటులు సహాయక పాత్రలు చేశారు. అందులో జవహర్ శక్తి అనే ఓ నటుడు కూడా ఈ మూవీలో ఓ కీ రోల్ చేశాడు. సినిమా షూటింగ్ సందర్భంగా వామికాకు, జవహర్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తనకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొబైల్ గిఫ్ట్ ఇచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడీ సహాయక నటుడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తోటి నటుడి పట్ల వామికా చూపిన ప్రేమను అందరూ మెచ్చుకుంటున్నారు.
Wamiqa Gabbi gifted a iPhone for his co-actor 🙌 pic.twitter.com/IK4OxIDM9F
— ⚡𝘼𝘽𝙎𝙊𝙇𝙐𝙏𝙀𝙇𝙔 ©️𝙄𝙉𝙀𝙈𝘼 (@Absolutlycinema) August 12, 2026
ఇక వామిక గబ్బి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. 2015లో వచ్చిన ‘భలే మంచిరోజు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో చాలా సినిమాలు చేసిందీ కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు డీసీ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు అడివి శేష్ ‘గూఢచారి 2’లో హీరోయిన్‌గా చేస్తోంది అందాల తార. దీంతో పాటు రిషభ్ శెట్టి ‘జై హనుమాన్’లోనూ ఈమెని కీలక పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.