Sarkaru Vaari Paata: ఈసారి స్పీకర్లు పగిలిపోవాలే.. మహేశ్‌ మూవీ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌.. టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

| Edited By: Phani CH

Apr 21, 2022 | 9:48 AM

Sarkaru Vaari Paata Title Song: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). గీత గోవిందం ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో

Sarkaru Vaari Paata: ఈసారి స్పీకర్లు పగిలిపోవాలే.. మహేశ్‌ మూవీ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌.. టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..
Sarkaru Vaari Paata
Follow us on

Sarkaru Vaari Paata Title Song: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). గీత గోవిందం ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. మ్యూజిక్‌ సెన్సేషన్‌ థమన్‌ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్‌లో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈక్రమంలో ఫ్యాన్స్‌కు మరో మ్యూజికల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సర్కారు వారి పాట చిత్రబృందం సిద్ధమైంది. మూడో సింగిల్‌ రిలీజ్‌కు సంబంధించి తాజా అప్‌డేట్‌ని ప్రకటించింది. ఈ సినిమాలో మూడో పాట టైటిల్ సాంగ్‌ను ఈ నెల 23న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ తెలిపారు. దీనికి ‘ఈసారి స్పీకర్లు పగిలిపోవాలే’ క్రేజీ క్యాప్షన్‌ని కూడా జోడించారు. ఈ పాట ట్యూన్‌ని సినిమా టీజర్‌కి బీజీఎంగా కూడా ఉపయోగించారు.

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో హీరోహీరోయిన్లపై ఒక మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చిత్రబృందం వెల్లడించింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‏గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలున్న సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read:Gold Smuggling: వామ్మో.. వీడి తెలివి తగలెయ్యా! బట్టతలలో దాచి బంగారం స్మగ్లింగ్‌.. విగ్గు తీసి చూసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్‌..

Coconut Water Benefits: ప్రతిరోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు లాభాలు.. హైబీపీతో పాటు అనేక సమస్యలకు చెక్..

Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన