ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 05న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 02) హైదరాబాద్ లోని యూసూఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుష్ప 2 చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప 2 లో కిస్సిక్ స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల మాట్లాడుతూ.. నాకు ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం ఎంత సంతోషకరంగా ఉంది. పుష్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి నా ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు’
‘సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు పనిచేస్తుంటే అందరూ వారిద్దరూ అతలాకుతలం అయిపోతారనుకుంటారు. కానీ రష్మిక, నన్ను చూసి మిగతా వారంతా సెట్స్ లో అతలాకుతలం అయిపోయారు. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉండటం సంతోషకరం. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, చంద్రబోస్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ కి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చింది శ్రీలీల.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.