Pushpa The Rise: థియేటర్స్‌లో పుష్పరాజ్ హవా.. ‘దాక్కో దాక్కో మేక’.. ఫుల్ సాంగ్ వచ్చేసింది..

|

Dec 30, 2021 | 11:06 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకొని గంభీరంగా అడావిలో పులిలా తిరుగుతుంటే ఫ్యాన్స్ కు పూనకాలు రాకుండా ఉంటాయా..?

Pushpa The Rise: థియేటర్స్‌లో పుష్పరాజ్ హవా.. దాక్కో దాక్కో మేక.. ఫుల్ సాంగ్ వచ్చేసింది..
Bunny
Follow us on

Pushpa: The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకొని గంభీరంగా అడావిలో పులిలా తిరుగుతుంటే ఫ్యాన్స్ కు పూనకాలు రాకుండా ఉంటాయా..? ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయినా అన్నీ థియేట్సర్ లో ఇదే పరిస్థితి.. ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీ యాక్టింగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కోటిస్తోంది. ఇక  చిత్తూరు యాసలో బన్నీ తగ్గేదే లే అంటుంటే కలక్షన్ల వర్షం కురుస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై సుకుమార్ టీజర్స్, ట్రైలర్ రూపంలో భారీ అంచనాలను క్రియేట్ చేశాడు. ఇక సినిమా విడుదల ఆ అంచనాలను అందుకోవడంతో భారీ విజయం దక్కింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది.

ఇక ఈ సినిమాకు బన్నీ నటనతోపాటు దేవీశ్రీ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయ్యింది. సుకుమార్ సినిమాకు దేవీ అందించే సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అవ్వడంతో దేవీ శ్రీ తన బెస్ట్ చూపించాడు. ఈ సినిమాలో అన్నీ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఊపేస్తోంది. ఇక ఈ సినిమాలో దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ ను అన్నింటి కంటే ముందే రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది. మిలియన్ కొద్దీ వ్యూస్ తో లైక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాట వినడానికే కాదు విజువల్ పరంగాను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..