
ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ చరణ్. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతే కాదు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్ది సినిమా కోసం అభిమానులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా.. పెద్ది మూవీ నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
ఇక నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. పెద్ది సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఈ వీడియోలో చరణ్ అదరగొట్టేశారు. చరణ్ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించనున్నారని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా గద పట్టుకొని చరణ్ లుక్స్ మాములుగా లేవు. ఈ వీడియోలో కుస్తీ గురించి చూపించారు. ఆటే నా ప్రాణం అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
ఇక ఏప్రిల్ 30న పెద్ది సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశపరచడంతో పెద్ది సినిమా పై చరణ్ అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ మాస్ అవతార్ లో కనిపించనుండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.