Actor Ali: అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్

రాజకీయాలకు స్వస్తి చెప్పిన నటుడు అలీ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారీ స్టార్ కమెడియన్. అయితే తాజాగా కాలికి పెద్ద కట్టుతో కనిపించారు అలీ. దీనిని చూసి సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే..

Actor Ali: అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
Actor Ali

Updated on: Sep 03, 2026 | 8:27 PM

రాజకీయాల కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరమయ్యారు కమెడియన్ అలీ. అయితే కొన్ని రోజుల క్రితమే రాజకీయాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేశారాయన. మళ్లీ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్య నటుడిగా, సహాయక నటుడిగా చేస్తున్నారు అలీ. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అలీకి సంబందించిన ఒక వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపింది. అందులో ఆయన ఎడమ కాలికి పెద్ద బ్యాండేజ్ కట్టుకుని సోపాలో కూర్చొని కనిపించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు కంగారు పడ్డారు? అలీకి ఏమైంది? షూటింగ్‌లో ఏదైనా ప్రమాదం జరిగిందా? లేక యాక్సిడెంట్ అయిందా? అంటూ రకరకాల ప్రశ్నలు ఏశారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ అలీ భార్య జుబేదా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అలీ కాలికి నిజంగా గాయం కాలేదని ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఇలా నటిస్తున్నారు అంటూ ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం అలీ దాదీకి షాది అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలీ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే అలీ పాత్రకు సంబంధించి ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ టైంలో భాగంగా ఆలీ భార్య జుబేదా సదరాగా ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలీకి కాలు విరిచేసి లంచ్ పెట్టిన యూనిట్ అంటూ సరదాగా చెప్పుకు వచ్చారు జుబేదా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కాలికి కట్టుతో అలీ.. వీడియో

కాగా ప్రస్తుతం అలీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కుకూ విత్ జాతి రత్నాలు అనే షోలో అలీ సందడి చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారాయన. తన భార్య జుబేదాతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us