
ప్రముఖ నటి కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్‌గా, హీరోయిన్‌గా రాణించింది స్వాతి. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది స్వాతి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కలర్ స్వాతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి పెళ్లి చేసుకుంటాను అనే పదాన్ని ఉపయోగిస్తారని, తాను హోమ్లీ గర్ల్‌గా కనిపించడం వల్ల ఇలాంటి ప్రపోజల్స్ ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపారు. అయితే, వారి మాటల్లో నిజాయితీ లేదని తాను గ్రహించానని, అందుకే నో థాంక్స్ చెప్పేదాన్నని స్వాతి తెలిపారు. తాను చూసిన అనేక వివాహ బంధాల్లోని హిపోక్రసీ, అంటే భార్యాభర్తలు పైకి ప్రేమగా కనిపించినా, లోపల చాలా సమస్యలు ఉంటాయని, చేతులు పట్టుకుని తిరుగుతూనే, ప్రైవేటుగా వేరే ఎస్ఎంఎస్‌లు పంపుకుంటూ ఉంటారని స్వాతి పేర్కొన్నారు.
ఇలాంటివి చూసిన తర్వాత తనకు పెళ్లిపై వైరాగ్యం కలిగిందని, అప్పట్లో పెళ్లి చేసుకోవడం కన్నా ఒక కుక్కను పెంచుకుని, తన తల్లిదండ్రులు అవసరమైనంత కాలం వారిని చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే, స్వాతి తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ ఉపయోగించి, “మీరు సంతోషంగా ఉండాలని మాకు లేదా?” అని అడగడంతో, చివరికి వారికి పెళ్లి సంబంధాలు చూడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని స్వాతి తెలిపారు. ప్రేమ వివాహాలపై తనకు ఓపిక లేదని, ఏదైనా తప్పు జరిగితే తానే అనుభవించాల్సి వస్తుందని ఆమె అన్నారు.
అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే, ఏదైనా సమస్య వచ్చినా “మీరే తీసుకొచ్చారు కదా” అని వారిని అనొచ్చని, తనకు ఆ బాధ తప్పుతుందని సరదాగా తెలిపారు స్వాతి. మంచి అబ్బాయి దొరకడం అంటే అదృష్టమని, సైకోలు, అబద్ధాలు చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారని, వారితో కలిసి పని చేసిన అనుభవం తనకు ఉందని స్వాతి పేర్కొన్నారు. అయితే తన తండ్రి, చిన్నాన్న వంటి వారు సంతోషంగా ఉన్నారని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.