
దళపతి విజయ్ సినిమాల్లో తిరుగులేని హీరోగా రాణించి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగారు. తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే తరుగులేని విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఘనవిజయం సాధించారు. దాంతో విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సామాన్యులకు సేవ చేసే పనిలో పడ్డారు. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గుడి, బడి, బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం దుకాణాలను తీసివేయాలని ఆదేశించారు. కాగా తాజాగా సీఎం విజయ్ మంచి మనసు చాటుకున్నారు. ఓ కమెడియన్ కు ఆయన సాయం అందించారు.
హాస్యనటుడు ముత్తుకలై ముఖ్యమంత్రి విజయ్ సహాయం అందించారని తెలుస్తుంది. కమెడియన్ ముత్తుకలై ఓ వీడియో ద్వారా ఇటీవలే తన భార్యకు సర్జరీ జరిగిందని ఆ తర్వాత తన భార్య మాలతికి ఊపిరితిత్తులు, ఇతర చోట్ల సమస్యలు తలెత్తాయని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తన భార్యకు మెరుగైన వైద్య చికిత్స కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సిఫార్సు చేయాలని ఆయన ఓ వీడియోలో రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ వీడియో సీఎం విజయ్ కు చేరింది. దాంతో ఆయనకు సాయం అందించారని తెలుస్తుంది.
ముత్తుకలై సాయం కోసం రిక్వెస్ట్ చేసిన తర్వాత, విజయ్ మంత్రి ఆదావ్ అర్జునతో ఆ హాస్యనటుడితో, అతని కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడించి, మాలతి ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలుస్తుంది. మంత్రి రాజ్ మోహన్‌ను ఆసుపత్రికి పంపి, ఆమెకు ఉన్నత వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు సీఎం విజయ్ ఆదేశించారు. కాగా ముత్తుకలై కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. కమెడియన్ కు విజయ్ సాయం చేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.