Charmi About Her Marriage: జీవితంలో అలాంటి త‌ప్పు చేయ‌నంటున్న ఛార్మీ.. పెళ్లి వార్త‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Charmi About Her Marriage: న‌టి ఛార్మి పెళ్లి విష‌యంపై ఎప్పు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. గ‌తంలో ఈ అందాల తార సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో ప్రేమ‌లో ఉంద‌ని వివాహం కూడా...

Charmi About Her Marriage: జీవితంలో అలాంటి త‌ప్పు చేయ‌నంటున్న ఛార్మీ.. పెళ్లి వార్త‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Charmi About Marriage

Updated on: May 09, 2021 | 6:00 AM

Charmi About Her Marriage: న‌టి ఛార్మి పెళ్లి విష‌యంపై ఎప్పు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. గ‌తంలో ఈ అందాల తార సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో ప్రేమ‌లో ఉంద‌ని వివాహం కూడా చేసుకోనున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే త‌ర్వాత అవ‌న్నీ పుకార్లు అని తేలాయి. ఇక అనంత‌రం ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్‌తో క‌లిసి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన త‌ర్వాత‌.. ఛార్మీ పూరీతో రిలేష‌న్‌లో ఉంద‌ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్త‌ల‌ను కూడా వీరు కొట్టేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఛార్మీ నిజంగానే వివాహం చేసుకోనుంద‌ని ఓ వార్త తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. స‌మీప బంధువును పెళ్లి చేసుకోవ‌డానికి ఛార్మీ సిద్ద‌మైన‌ట్లు దీనికి ఆమె పేరెంట్స్ కూడా ఓకే చెప్పార‌ని వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. అయితే న‌టి ఛార్మీ ఈ వార్త‌ల‌ను కూడా కొట్టిపారేశారు. ఈ సంద‌ర్భంగా త‌న వివాహంపై వ‌స్తోన్న‌వార్త‌ల గురించి స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేసిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం నేను జీవితంలో బెస్ట్ స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాను. నేను నా జీవితంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్‌లో పెళ్లి చేసుకోవ‌డ‌మ‌నే త‌ప్పును నేను ఎప్ప‌డూ చేయ‌ను అంటూ కుండ బ‌ద్ధ‌లు కొట్టింది ఛార్మీ. మ‌రి వివాహ వ్య‌వ‌స్థ‌పై ఛార్మీకి ఇంత‌లా వ్య‌తిరేక‌త క‌ల‌గ‌డానికి కార‌ణ‌మేంటో త‌న‌కే తెలియాలి. ఇదిలా ఉంటే ఛార్మీ ప్ర‌స్తుతం పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.

Charmi

Also Read: Bandla Ganesh: కరోనా భయం.. తండ్రికి స్వయంగా కటింగ్ చేసిన బండ్ల గణేష్.. వీడియో

Anasuya Bharadwaj: పుష్ప తర్వాత.. రంగమ్మత్తను మరిచిపోతారా..? అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

SS Rajamouli: జక్క‌న్నకు సాటిలేరు ఎవ‌రూ.. ! ఆకాశానికెత్తేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే