
టాలీవుడ్ కమెడియన్ చమ్మక్ చంద్ర ‘జబర్దస్త్’ షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ షో తన కెరీర్‌కు ఎంతో గుర్తింపునిచ్చిందని, టీమ్ లీడర్‌గా తనకు లభించిన అవకాశం పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని ఆయన పేర్కొన్నారు. షోలో ఉన్నంత కాలం నెలకు నాలుగు ఎపిసోడ్‌లు చేస్తూ, మిగిలిన సమయంలో సినిమాల్లో నటిస్తూ సంతోషంగానే గడిపానని తెలిపారు. అయితే, జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం పని భారం అని చమ్మక్ చంద్ర వెల్లడించారు. ప్రతి స్కిట్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవడం, స్క్రిప్ట్ రాయడం, టీమ్ సభ్యులకు డైలాగులు నేర్పించి రిహార్సల్స్ చేయించడం వంటి పనులు శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమతో కూడుకున్నవిగా మారాయని చెప్పారు. తనకు అప్పటికప్పుడు స్క్రిప్ట్ రాసి నటించడం అలవాటు లేదని, దానివల్ల వారం రోజుల ముందు నుంచే తీవ్రంగా కష్టపడాల్సి వచ్చేదని ఆయన వివరించారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
ఈ ఒత్తిడి నుంచి కొంత విశ్రాంతి కోరుకునే తాను షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. జబర్దస్త్ నుంచి నిష్క్రమించిన తర్వాత చమ్మక్ చంద్ర తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టారు. ఇప్పటికే దాదాపు 60-70 చిత్రాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తుండటం వల్ల ప్రశాంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నానని, భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరమైతే టీవీ రంగం తనకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?