Tollywood: చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?.. వెండితెరపై నాట్యమయూరి ఈ హీరోయిన్..

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని అగ్ర నటీనటుల చిన్నప్పటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి మహాలక్ష్మి ఒకప్పుడు దక్షిణాది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు నాట్యమయూరిగా ఎంతో మంది చిన్నారులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది.

Tollywood: చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?.. వెండితెరపై నాట్యమయూరి ఈ హీరోయిన్..
Actress1
Follow us

|

Updated on: Apr 24, 2024 | 11:17 AM

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి చిత్రాలను, వారి ఆఫ్-స్క్రీన్ కథలను తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు తమ ఫేవరేట్ హీరోహీరోయిన్ గురించి తెలుసుకోవాలంటే మ్యాగజైన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అభిమాన తారలతో ఫ్యాన్స్ నేరుగా ముచ్చటిస్తున్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా తమ లైఫ్ గురించి.. చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు తారలు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ ఫ్యాన్ పేజీల ద్వారా నెట్టింట వైరలవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోని అగ్ర నటీనటుల చిన్నప్పటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి మహాలక్ష్మి ఒకప్పుడు దక్షిణాది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు నాట్యమయూరిగా ఎంతో మంది చిన్నారులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. తను ఎవరంటే సీనియర్ హీరోయిన్ శోభన.

ఈ చిత్రాన్ని శోభన ఫ్యాన్ పేజీ ‘విటామాటెక్స్’లో షేర్ చేశారు. సినీ ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్ శోభన. 80, 90’sలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించింది.తెలుగు, తమిళం, మలయాళంలో అనేక సినిమాల్లో కనిపించింది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. 1986వో అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారీ, వెంకటేష్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. నటిగానే కాకుండా శోభన నాట్యంలోనూ శిక్షణ పొందింది.

శోభన వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. ప్రస్తుతం కళార్పణ అనే సంస్థ ద్వారా ఎంతోమందికి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. తన జీవితాన్ని పూర్తిగా శాస్త్రీయ నృత్యానికి అంకితం చేసింది. సినిమాలకు దూరంగా ఉన్న శోభన.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు తన డాన్స్ స్కూల్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది శోభన.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...