ఈ థియేటర్‌ది 125 ఏళ్ల హిస్టరీ.. 

TV9 Telugu

05 May 2024

ఫ్రాన్స్‌ దేశంలోని లా సియోటట్‌లో ఉన్న ఈడన్‌ అనే సినిమా థియేటర్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన థియేటర్‌.

1899లో ప్రారంభమైన ఈ సినిమా హాల్‌ మధ్యలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ జోరుగా హుషారుగా నడుస్తోంది..

లుమైరి బ్రదర్స్‌ తీసిన కదులుతున్న ట్రైన్‌ను మొట్టమొదటిసారిగా ఈ ఓల్డ్ సినిమా థియేటర్‌ తెరపై ప్రదర్శించారు.

నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్ని సినిమాతో ఈ థియేటర్‌ మొదలయ్యింది. ట్రైన్‌ స్టేషన్‌లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.

మంది ప్రేక్షకులు అందించిన శుభాశీస్సులో , వారి బోణి ఇచ్చిన బలమో ఏమో కానీ ఈడెన్‌ థియేటర్‌ 1995 వరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది.

దాదాపు 80 లక్షల డాలర్లతో, మన కరెన్సీలో చెప్పాలంటే 49 కోట్ల రూపాయలను వెచ్చించి థియేటర్‌ను అందంగా తీర్చి దిద్దారు.

కొత్తగా అమర్చిన వెల్వెట్‌ సీట్లు, కొత్త కార్పెట్లు, మొజాయిక్‌ ఫ్లోరింగ్‌, పసుపుపచ్చని పెయింట్‌తో సినిమా హాల్‌కు కొత్త కళ వచ్చింది.

ఇప్పుడా థియేటర్‌ టూరిస్ట్‌ ప్లేస్‌గా మారింది.. కేవలం 166 మంది ప్రేక్షకులు పట్టేంత చిన్న సినిమా హాలే అయినా అది ఫ్రాన్స్‌ ప్రజల గుండెచప్పుడు. వారికదో గర్వకారణం.