Tollywood: సైకిల్‌పై ప్రయాణిస్తూ కనిపించిన టాలీవుడ్ హీరో – ఎవరో కనిపెట్టారా..?

టాలీవుడ్‌లో 23 ఏళ్ల క్రితం హీరోగా పరిచయమై... ఆ తర్వాత కనుమరుగై పోయాడు. ఇటీవల రెండేళ్ల క్రితం ఓ సినిమాతో మళ్లీ వెండితెరపై మెరిశాడు. ఇప్పుడిక సైక్లింగ్ చేస్తున్న ఫొటోలతో మళ్లీ హల్‌చల్ చేస్తున్నాడు. బ్యాక్‌సైడ్ నుంచి లుక్ చూసి ఆయనెవరో మీరు చెప్పగలరా..?

Tollywood: సైకిల్‌పై ప్రయాణిస్తూ కనిపించిన టాలీవుడ్ హీరో - ఎవరో కనిపెట్టారా..?
Tollywood Hero

Updated on: Jul 22, 2025 | 4:06 PM

ఈ మధ్య మూవీ సెలబ్రిటీస్ తమ సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎక్కడ ఫోటోలు దిగినా, వీడియోలు తీసినా వాటిని షేర్ చేస్తున్నారు. అలా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటున్నారు. అలా ఓ టాలీవుడ్ హీరో సైకిల్ తొక్కుతూ ప్రకృతి ఆస్వాదించారు. అతను మరెవరో కాదు. నందమూరి హీరో.. బ్యాక్ నుంచి చూసి ఎవరో కనిపెట్టారా..? లేదా చిన్న క్లూస్ ఇస్తాం. ఎప్పుడో 23 ఏళ్ల క్రితం ఓ సినిమా చేశారు ఈ హీరో. ఆ తర్వాత తెరమరుగు అయ్యాడు. మళ్లీ 2023లో మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుటికే ఆయన ఎవరో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మీ గెస్ కరెక్ట్.. తను నందమూరి చైతన్య కృష్ణ.

దివంగత ఎన్టీఆర్ రెండవ తనయుడు జయకృష్ణ తనయుడే చైతన్య కృష్ణ. గతంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ మూవీలో పెద్దగా గుర్తింపు లేని ఓ పాత్ర చేశారు. ఒకే ఒక్క సినిమాతో పూర్తిగా నటనకు దూరమయ్యాడు. కానీ చాన్నాళ్ల తర్వాత ‘బ్రీత్’ సినిమా చేశాడు. తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా విజయం సాధించలేదు.  కాగా, చైతన్య కృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన అప్పుడప్పుడు వైసీపీ నేతలపై విరుచుకుపడుతూ ఉంటారు. మరి చైతన్య కృష్ణకు నటనలో కొనసాగే అవకాశం ఉందో లేదో తెలియాల్సి ఉంది. తాజాగా సైక్లింగ్ చేస్తూ కనిపించిన చైతన్య కృష్ణ.. ‘ఇది నా కొత్త వ్యాయామం.. తెలుగు దేశం పార్టీ సింబల్ అయిన సైకిల్‌పై రైడ్‌ను ఆనందిస్తున్నాను’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా… తనకు నచ్చినట్లు బతికేస్తుంటారు చైతన్య కృష్ణ.