బూరెబుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. కనిపెట్టారా..?

|

Oct 02, 2021 | 9:06 PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా నెట్టుకురావడం అంటే అంత ఈజీ కాదు.. ఎంత స్టార్స్ కిడ్స్ అయినా సరే టాలెంట్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు ప్రేక్షకులు..

బూరెబుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. కనిపెట్టారా..?
Follow us on

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా నెట్టుకురావడం అంటే అంత ఈజీ కాదు.. ఎంత స్టార్స్ కిడ్స్ అయినా సరే టాలెంట్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు ప్రేక్షకులు.. పైగా ఎప్పటికప్పుడు కొత్త అందాలు పలకరిస్తున్నాయి.. ఇలాంటి టఫ్ టైమ్‌‌‌లోనూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. పైగా కొత్త అందాల తాకిడి బాలీవుడ్ లో ఎక్కువ ఉంటుంది. కానీ ఈ అమ్మడు మాత్రం తన నటనతో ఆకట్టుకుంటూ.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లాంటి బడా స్టార్స్‌తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే..

బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ హావ నడుస్తున్న విషయం తెలిసిందే… ఇక పై ఫొటోలో పాలుగారే బుగ్గలతో ఫోన్ మాట్లాడుతున్న చిన్నారి ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ సోనాక్షి సిన్హా ‘దబాంగ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేస్‌లో కంటిన్యూ అవుతుంది సోనాక్షి..