Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బ్యాన్ చేయాలంటూ రాజా సింగ్ డిమాండ్..

బిగ్ బాస్ ఈ రియాల్టీ గేమ్ షో ఎంత అందరాని పొందిందో అంటే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ శృతిమించుతున్నారు అంటూ ఇప్పటికే పలువురు ఆరోపిస్తూ వస్తున్నారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బ్యాన్ చేయాలంటూ రాజా సింగ్ డిమాండ్..
Raja Singh

Updated on: Nov 29, 2021 | 12:21 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఈ రియాల్టీ గేమ్ షో ఎంత అందరాని పొందిందో అంటే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్ శృతిమించుతున్నారు అంటూ ఇప్పటికే పలువురు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ గేమ్ షో వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సీపీఐ నారాయణ కోర్టులోకేసు కూడా వేశారు. ఆయన ఎప్పుడు బిగ్ బాస్ గేమ్ పట్ల వ్యతిరేకతను చూపుతూ వచ్చారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్ధంకావడంలేదు అన్నారు రాజా సింగ్.

యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంలో ఎదో జరిగిందని అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో బయటకు రావాలి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్ లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడ్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చరచ్చ చేసారు.. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్ లు ఇస్తున్నారు..? చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారు అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందే.. అన్నీ భాషలు ఉన్న బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలనీ కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తా.. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్ లో కించపరుస్తున్నారని రాజా సింగ్ మండి పడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shiva Shankar Master Deth: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

Bimbisara: త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం “బింబిసారా”.. టీజర్ అదుర్స్..

Choreographer Shiva Shankar Passes Away: కరోనా కాటుకు కొరియోగ్రాఫర్ బలి.. శివ శంకర్ మాస్టర్ సినీ ప్రపంచంలో విషాదం.. (వీడియో)

 

Follow Us