Ashu Reddy: సంక్రాంతి సందర్భంగా తల్లికి సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన అషూ రెడ్డి.. అదేంటంటే..

| Edited By: Ravi Kiran

Jan 17, 2022 | 6:46 AM

చూడడానికి అచ్చం సమంతలానే కనిపిస్తూ  జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి.  ఈ పేరుతోనే  సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనే

Ashu Reddy: సంక్రాంతి సందర్భంగా తల్లికి సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన అషూ రెడ్డి.. అదేంటంటే..
Ashu Reddy
Follow us on

చూడడానికి అచ్చం సమంతలానే కనిపిస్తూ  జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి.  ఈ పేరుతోనే  సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.  విజేతగా నిలవకపోయినా తనదైన అల్లరి పనులు, అందంతో బుల్లి తెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఆ మధ్యన  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చి వార్తల్లో నిలిచిన ఈ అందాల తార. . ఇటీవల తన అభిమాన నటి సమంత నటించిన ‘ ఉ అంటావా మావ’ ను రీక్రియేట్ చేసి అలరించింది. కాగా  తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగను అషూ రెడ్డి కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.  కాగా పండగను పురస్కరించుకుని బంగారం కొనుగోలు చేసిందీ బిగ్ బాస్ బ్యూటీ.  ఆ ఆభరణాలను అలంకరించుకుని  తెగ మురిసిపోయిందీ  ముద్దుగుమ్మ. అయితే ఈ నగలన్నీ తన కోసం కాదని తన తల్లికోసం కొన్నానంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో చెప్పుకొచ్చింది.

కాగా ఈ వీడియోలో బంగారు న‌గ‌ల‌ను చక్కగా ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లిన అషూ … వాటిని త‌ల్లికి  బహుమతిగా ఇచ్చి ఆమెను స‌ర్‌ప్రైజ్ చేసింది.  తన కూతురు బంగారు ఆభరణాలు తీసుకురావడం చూసి ఆమె  కూడా చాలా ఎగ్జ‌యిట్ అయింది. అంత‌కు ముందు కొనుగోలు చేసిన బంగారు గాజుల‌కు ఇవి చాలా బాగా సెట్ట‌వుతాయ‌ని తెగ సంబరపడిపోయింది.  ఈ సందర్భంగా తన కూతురుకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చిందా? అంటూ సరదాగా ఆట పట్టించే ప్రయత్నం చేసింది.  కాగా ప్రస్తుతం పలు టీవీ షోలలో నటిస్తోన్న అషూ రెడ్డి ప్ర‌స్తుతం ‘స‌ర్క‌స్ కార్ 2’  అనే సినిమాలో  న‌టిస్తోంది.  గతంలో విడుదలై మంచి విజయం సాధించిన  ‘సర్కస్ కార్’  సీక్వెల్‌గా ఈ సినిమా  తెర‌కెక్కుతోంది.  మొదటి భాగానికి దర్శకత్వం వహించిన  నల్లబిల్లి వెంకటేష్   ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

ఈ మేకకు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ లేకుంటే ముద్ద దిగ‌దు.. వీడియో

Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో