Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ చెల్లెలు అంటూ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కామనర్స్ కోటాలో అడుగు పెట్టిన కంటెస్టెంట్లలో రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ ఒకరు. అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన ఆమె బిగ్ బాస్ 10లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.

Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ చెల్లెలు అంటూ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి
Bigg Boss Telugu 10

Updated on: Sep 17, 2026 | 8:31 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో ఇప్పటికే మొదటి వారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో వారం కూడా దాదాపు 11 మంది నామినేషన్స్ లో ఉన్నారు.
దీంతో ఈవారం ఎవరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారనే విషయంపై ఉత్కంఠ రేపుతోంది. కాగా ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరీలో కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ సీజన్ 2 ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసి హౌస్ లోకి ఆరుగురు కంటెస్టెంట్లను పంపించారు. ఇలా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో రైతు బిడ్డ కమ్ సింగర్ ఝాన్సీ ఒకరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తన తండ్రికి చేదోడువాదోడుగా పొలం పనులుచేస్తూనే మరోవైపు ఉన్నత చదువులు చదువుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లోకి అడుగు పెట్టిన ఆమె తన ట్యాలెంట్ తో బిగ్ బాస్ టికెట్ అందుకొని హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఝాన్సీ ఆట తీరు పూర్తిగా మారిపోయిందని, చాలా సెల్ఫీష్ గా గేమ్ ఆడుతోందని, కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోటు పొడుస్తుంది అంటూ ఈ రైతు బిడ్డపై విమర్శలు కురిపిస్తున్నారు. ఝాన్సీ రైతు బిడ్డ పేరుతో డ్రామా నడిపిస్తోందని, ఆమెను చూస్తుంటే పల్లవి ప్రశాంత్ గుర్తుకొస్తున్నాడంటూ నెటిజన్లు ఈ రైతుబిడ్డపై ట్రోల్స్ చేస్తున్నారు

కాగా ఝాన్సీపై వస్తోన్న విమర్శలపై ఆమె తల్లి హేమలత స్పందించారు. ‘ ఝాన్సీ బిగ్ బాస్ లోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నా కుమార్తె ఝాన్సీ చాలా అద్భుతంగా ఆట ఆడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది నా కూతురిని అభిమానిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే ఆమెను విమర్శిస్తున్నారు. నా కూతురిని విమర్శించేముందు తన స్థానంలో మీ అక్క లేదా చెల్లెలు ఉంటే ఇలాగే విమర్శలు కురిపిస్తారా? కొన్ని లక్షల మంది నా కూతురుని అభిమానిస్తున్నారు. వారి ఆశీర్వాదాలే తనను గెలిపిస్తాయి. ఝాన్సీ చిన్నప్పటి నుంచే కష్టపడి పని చేసే తత్వం. ఆ కష్టపడే స్వభావమే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అని హేమలత చెప్పుకొచ్చారు. కాగా ఈ కామెంట్స్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఝాన్సీని సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో సింగర్ ఝాన్సీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us