
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ ఉండనుందని తెలుస్తోంది. ఇక తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు పదో ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కామన్ కంటెస్టెంట్ల ఎంపిక కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా జరుగుతోంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు, యూట్యూబర్ల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎవరు వచ్చినా రాకపోయినా ఒక తెలుగు బుల్లితెర నటుడు బిగ్ బాస్ తెలుగు 10 లోకి వచ్చే అవకాశముందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతను మరెవరో కాదు ‘మౌనరాగం’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన శివ్ కుమార్.
‘మౌనరాగం’ సీరియల్‌లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు శివకుమార్. అలాగే ‘నిన్ను కోరి’ సీరియల్ లతో ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేశాడు. ఇక శివ్ తన తోటి యాక్ట్రెస్ ప్రియాంక జైన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఈ జోడీకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో నిర్వహించిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాలిటీ షోలోనూ ప్రియాంక జైన్- శివ్ కుమార్ ల జోడీ ఆకట్టుకుంది.
గతంలో ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆట, మాట తీరుతో ఏకంగా టాప్ 5 ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే దారిలో ఆమె ప్రియుడు శివ్ కుమార్ కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలోనూ శివ్ కు మంచి క్రేజ్ ఉండడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ల లిస్టులో శివ్ కుమార్ కచ్చితంగా ఉంటాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి