Childhood Photo: సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

Childhood Photo: బాల్యాన్ని మనకు ఫోటోలు గుర్తు చేస్తే.. సెలబ్రెటీలకు సినిమాల్లోని వారి పాత్రలు వారి బాల్యాన్ని గుర్తు చేస్తాయి. చాలామంది సినిమాల్లో బాలనటులుగా నటించి పెరిగి పెద్ద అయిన తర్వాత అదే రంగంలోకి..

Childhood Photo: సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..
Childhood Pic

Edited By: Anil kumar poka

Updated on: Aug 24, 2021 | 11:22 AM

Childhood Photo: బాల్యాన్ని మనకు ఫోటోలు గుర్తు చేస్తే.. సెలబ్రెటీలకు సినిమాల్లోని వారి పాత్రలు వారి బాల్యాన్ని గుర్తు చేస్తాయి. చాలామంది సినిమాల్లో బాలనటులుగా నటించి పెరిగి పెద్ద అయిన తర్వాత అదే రంగంలోకి.. అడుగు పెట్టినవారు కొందరు అయితే.. మరికొందరు విభిన్న వృత్తులను ఎంచుకుని తమదైన శైలిలో కెరీర్ లో దూసుకెళ్తున్నవారు ఇంకొందరు. అయితే సినీ పరిశ్రమలో హీరోల తనయులు హీరోలుగా అడుగు పెట్టి రాణించినవారు చాలామంది ఉన్నారు. ఈ ఫొటోలో నటశిరోమణి సావిత్రి చేతిలో ఉన్న చిన్నోడు ఒక స్టార్ హీరో తనయుడు.. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. అంతేకాదు ఆయన తనయులు కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఎవరో గుర్తు పట్టారా.. సావిత్రి ఎత్తుకున్న ఆ చిన్నారి బాలుడుని..

అయితే అప్పట్లో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, బాలకృష్ణలు ఆయన సినిమాల్లో బాలనటులుగా నటిస్తే.. అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లో తనయుడు నాగార్జున కూడా బాలనటుడిగా రెండు సినిమాల్లో నటించాడు. ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు వుంటాయని వాటిని ఎదిరించి జీవితంలో ఎదగాలని స్ఫూర్తినింపిన సినిమా వెలుగునీడలు. అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో బాలనటుడుగా అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున నటించారు. చల్లని వెన్నెల సోనలు అనే పాటలో అక్కినేని, సావిత్రి నాగార్జునని ఎత్తుకున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జునకి కేవలం 8 నెలలు కావడం విశేషం. అనంతరం సుడిగుండాలు సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నాగార్జున నటించాడు.

ఇక తండ్రి బాటలోనే హీరోగా వెండి తెరపై విక్రమ్ సినిమాతో అడుగు పెట్టాడు. విభిన్న కథాచిత్రలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కింగ్ నాగార్జున తనదైన ముద్ర వేసుకుని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక నాగార్జున తనయుడు అఖిల్ కూడా సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పడు అఖిల్ వయసు కేవలం ఏడాది మాత్రమే కావడం విశేషం.

Also Read: Rent Tiny Toilet: అద్దెకు టాయిలెట్.. ఫ్రిడ్జ్, వైఫై వంటి సౌకర్యాలు అదనం.. వారానికి రెంట్ రూ.5వేలు.. ఎక్కడంటే..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయం అవుతుందా? రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో చూడండి!

నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం..!

గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ