Oscars 2024 : ఈసారి ఆస్కార్ అవార్డు అందుకున్న సాంగ్ ఇదే.. అప్పుడు నాటు నాటు.. ఇప్పుడేమో

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులను అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

Oscars 2024 : ఈసారి ఆస్కార్ అవార్డు అందుకున్న సాంగ్ ఇదే.. అప్పుడు నాటు నాటు.. ఇప్పుడేమో
Oscars
Follow us

|

Updated on: Mar 11, 2024 | 1:38 PM

ఆస్కార్.. ప్రతిష్ఠామకమైన ఈ అవార్డును అందుకోవాలని ప్రతి దర్శకుడు, హీరో కళలు కంటుంటారు గత ఏడాది మన తెలుగు సినిమా ఆస్కార్ వేదిక పై దుమ్మురేపింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులను అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు హాలీవుడ్ లెజెండ్రీ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటుకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. అంతే కాదు ఈ సాంగ్ కు ఆస్కార్ వేదిక పై స్టెప్పులు కూడా వేశారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ ను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఆలపించారు. ఈ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ లభించింది. ఈ అవార్డును కీరవాణి, పాట రచయిత చంద్ర బోస్ అందుకున్నారు.

ఇక ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా నిలిచినా పాట ఎదో తెలుసా.? ఈసారి ఇండియన్ సినిమాలు ఆస్కార్ రేస్ లో లేవు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఓపెన్ హైమర్’ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించిన ‘బార్బీ’ సినిమాలోని పాటకు ఈసారి ఆస్కార్ అవార్డు దక్కింది. ఈమూవీలోని వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ అనే పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు లభించింది. బిల్లీ ఏలిష్ ఈ పాటను ఆలపించారు.

ఆస్కార్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..