CSK vs SRH Preview: చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇరుజట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Chennai Super Kings vs Sunrisers Hyderabad, 46th Match: సూపర్ సండే మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమిని మర్చిపోవాలని సన్ రైజర్స్ ప్రయత్నిస్తుండగా, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లూ ఓటమిని తప్పించుకోవాలని చూస్తున్నాయి.

CSK vs SRH Preview: చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇరుజట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Csk Vs Srh Preview
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:49 AM

IPL 2024, CSK vs SRH Preview: సూపర్ సండే మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమిని మర్చిపోవాలని సన్ రైజర్స్ ప్రయత్నిస్తుండగా, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి.

ఈ రోజుల్లో ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన జట్లు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈ ఉదాహరణను చూపిస్తు్న్నాయి. చెన్నై, హైదరాబాద్ బలమైన జట్లే అయినప్పటికీ చివరిసారిగా ఏప్రిల్ 5న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ తినిగి విజయాల గాడిలోకి రావాలని చూస్తోంది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భయాందోళనకు గురయ్యారు. ప్రారంభంలోనే ఔటయ్యారు. దీంతో వారు భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఈ స్టార్-స్టడెడ్ టీమ్‌కు కీలక మ్యాచ్‌లలో భారీ ప్రదర్శన చేయగల శక్తి ఉంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్ లాంటి బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగలరు. బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది.

మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ బలం తగ్గిందని అనిపిస్తోంది. చెన్నై బౌలర్లు దారుణంగా దెబ్బతిన్నారు. బ్యాటింగ్‌లో విదేశీ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ స్వదేశానికి చేరుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసి జట్టు బ్యాటింగ్‌కు బలాన్నిచ్చాడు. జట్టులో శివమ్ దూబే కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చెన్నై బౌలింగ్‌ ఎలాంటి బ్యాటింగ్‌ లైనప్‌నైనా మట్టికరిపిస్తుంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో దాని బౌలర్లు పేలవంగా కనిపించారనేది వేరే విషయం.

ఇవి కూడా చదవండి

8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 4 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. చెన్నై జట్టుకు 8 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్ 8 మ్యాచ్‌లు ఆడగా, అందులో 5 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి.

CSK వర్సెస్ SRH హెడ్ టు హెడ్ రికార్డ్స్..

ఇప్పటివరకు IPLలో చెన్నై వర్సెస్ హైదరాబాద్ ఒకదానితో ఒకటి 20 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 14 మ్యాచ్‌లు గెలుపొందగా, హైదరాబాద్ 6 సార్లు గెలిచింది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరాన.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మర్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్.

స్క్వాడ్‌లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (w), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్, ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ మాలిక్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ఝటవేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వి), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, శార్దూల్ ఠాకూర్, సమీర్ రిజువి, సమీర్ షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, రిచర్డ్ గ్లీసన్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, మహేశ్ తీక్షణ, నిశాంత్ సింధు, అరవెల్లి అవనీష్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..