Nandamuri Balakrishna: అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి హింట్ ఇచ్చిన బాలయ్య.. ఏమన్నారంటే

నందమూరి బాలకృష్ణ..! సిల్వర్ స్క్రీన్ నే కాదు.. ఎల్‌ఈడీ..ఎల్‌సీడీ.. స్క్రీన్‌లను కూడా రఫ్పాడిస్తున్నారు. భారీ డైలాగులు చెబుతున్నాడు.

Nandamuri Balakrishna: అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి హింట్ ఇచ్చిన బాలయ్య.. ఏమన్నారంటే
Nbk

Updated on: Jun 20, 2022 | 9:16 PM

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. సిల్వర్ స్క్రీన్ నే కాదు.. ఎల్‌ఈడీ..ఎల్‌సీడీ.. స్క్రీన్‌లను కూడా రఫ్పాడిస్తున్నారు. భారీ డైలాగులు చెబుతున్నాడు. హుషారుకే కేరాఫ్ అడ్రస్ కే నిలుస్తున్నారు. సిర్ఫ్‌ ఎంటర్‌ టైన్మెంటే కాదు.. అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ను తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్‌కు ఇచ్చేస్తున్నాడు. బుల్లి తెరపై కూడా రికార్డులు బద్దలు కొడుతున్నాడు బాలయ్య. ఇప్పటికే ఆహా లో స్ట్రీమ్‌ అయిన అన్‌స్టాపబుల్ షో.. బాలయ్య ట్రూ ఎంటర్‌ టైనర్ గా నిలబడడమే కాదు.. ఆ షోను ఓటీటీ షోల్లోనే నెంబర్‌ 1 షోగా నిలిపారు. ఇక ఇప్పుడు అంతే క్రేజీగా.. అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం రెడీ అయిపోతున్నారు.

ఇక తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆహా..! త్వరలోనే సెకండ్‌ సీజన్‌ని ప్రారంభించనున్నట్టు చెప్పేసింది. దానికి తోడు రీసెంట్ గా ఆహాలోనే స్క్రీమ్‌ అయ్యే ఓ షోకు గెస్ట్ గా వెళ్లిన బాలయ్య.. మెమరీస్‌ క్రియేట్‌ చేయడానికి మళ్లీ వస్తున్నామంటూ అన్‌స్టాపబుల్‌ షో గురించి రివీల్ చేశారు. ఈ డైలాగ్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే ఇటీవలే అఖండ సినిమాతో అదరగొట్టిన బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us